కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్( Director Kalyan Shankar ) డైరెక్ట్ చేసిన కామెడీ డ్రామా మూవీ మ్యాడ్ (2023)( Mad Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ముగ్గురి స్నేహితుల జర్నీయే ఈ సినిమా స్టోరీ.
అయితే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీలో గణేష్ అలియాస్ “లడ్డూ”గా నటుడు విష్ణు ఓయ్( Actor Vishnu Oi ) నటించి మెప్పించాడు.అతని పాత్ర ఒక సైడ్ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది తప్ప మెయిన్ క్యారెక్టర్ లాగా ఏ కోణంలోనూ కనిపించదు.
కానీ సినిమా మొదలైన సమయం నుంచి విష్ణు ఓయ్‌కి మాత్రం “ఈ సినిమాలో మీ పాత్రే చాలా కీలకమైనది, ఫుల్ లెన్త్ రోల్.సినిమా మొత్తం మీ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది.హీరోలు ఉంటారు కానీ వాళ్లు నీ క్యారెక్టర్ ముందు జీరో.” అని కళ్యాణ్ శంకర్ చెప్పాడట.
అంతేకాదు సినిమా కూడా అతని క్యారెక్టర్ యే మెయిన్ అని ఫీలయ్యేలాగా నేరెట్ చేశాడట.ఆ కథ తన పాత్ర గురించి వినగానే విష్ణు ఎంతో సంబరపడిపోయాడు.ఆ మూవీ చేయడానికి ఒప్పేసుకున్నాడు.అలా జరిగిన కొద్ది రోజులకే సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది.తర్వాత ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి కానీ మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ కి ( Mad Movie Promotions ) విష్ణును ఎవరూ పిలవలేదు.మిగతా యాక్టర్స్ ని మాత్రం పిలిచారు.ఇదంతా గమనిస్తున్న విష్ణు ఒకరోజు డైరెక్టర్ ని కలిశాడు.” నా క్యారెక్టరే మెయిన్ అని చెప్పారు.అలాంటి నన్ను సినిమా ప్రమోషన్స్ కి ఎందుకు పిలవడం లేదు.పోస్టర్లలో నా ఫోటో ఎందుకు కనిపించడం లేదు.?” అని ప్రశ్నించాడు.
అయితే “నెక్స్ట్ పోస్టర్ లో నీ ఫోటో కనిపిస్తుందిలే లడ్డూ” అంటూ డైరెక్టర్ సాకులు చెప్పడం ప్రారంభించాడట.దాంతో చిర్రెత్తుకొచ్చిన విష్ణు డైరెక్టర్ టీమ్‌తో గొడవ పెట్టుకున్నాడు.చాలా సేపు వారి మధ్య తగువులాట జరిగినట్లు సమాచారం.
మొత్తం మీద యాక్టర్ విష్ణు ని బాగా వాడేసుకొని వదిలేసాడు డైరెక్టర్.సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుందని విష్ణుకి ఒక గుణపాఠం నేర్పించాడు.
అయితే ఈ సినిమాలో విష్ణుది ఫుల్ లెన్త్ రోల్ కాకపోయినా అతనికి బాగానే గుర్తింపు వచ్చింది.తన పాత్ర మేరకు విష్ణు అద్భుతంగా నటించాడు.
ఈ మూవీ కూడా హిట్ అయింది కాబట్టి దీన్ని చూసి అతనికి మరింత మంది దర్శకులు అవకాశాలు ఇవ్వచ్చు.