ఆ వ్యక్తి టాలెంట్ ను ఎవరూ సరిగ్గా వాడుకోలేదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.( Devara ) జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా నటించిన విషయం తెలిసిందే.

 Jr Ntr Intresting Comments On Bollywood Hero Saif Ali Khan Details, Jr Ntr, Deva-TeluguStop.com

ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

రోజు రోజుకి విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్ ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతున్నారు.మరోవైపు ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ అలాగే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) మూవీ మేకర్స్ ని ఇంటర్వ్యూ చేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దేవర సినిమాలో బైర పాత్ర ఎంతో కీలకం.ఆ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించింది.ఓంకార సినిమాలో( Omkaara Movie ) ఆయన యాక్టింగ్ అద్భుతం.

సైఫ్‌ టాలెంట్‌ను ఇప్పటివరకూ ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని నా భావన అని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈమెరకు తారక్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు.ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

తారక్ అభిమానులతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube