యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఆగస్టు 27వ తేది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని యువసుద ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీ విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్( Remuneration ) కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 45 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
ఇక ఈ దేవర సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.

ఇలా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో ఈమె కొనసాగుతున్న సంగతి మనకు తెలుస్తుంది.