సత్య కామెడీ టైమింగ్ ను వాడుకుంటే బొమ్మ బ్లాక్ బస్టర్.. చిన్న రోల్ లో సైతం అదరగొడుతున్నాడుగా!

కాగా ఒకప్పుడు సినిమాలలో కథతో సంబంధం లేకుండా కమెడియన్లకు సపరేట్ ట్రాక్స్ ఉండేవి.వీటిని మెయిన్ రైటర్స్ తో కాకుండా వేరే రచయితలతో రాయించేవారు.

 Satya Talk Of The Town After Mathu Vadalara 2 Release Details, Sathya, Mathuvada-TeluguStop.com

ఎంత లేదన్నా పావు గంట నుంచి ఇరవై నిమిషాల దాకా పెట్టేవారు.బ్రహ్మానందం, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్ అలా పేరు తెచ్చుకున్నవాళ్ళే.

కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఇలా సాధ్యపడకపోవడంతో హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య హాస్యాన్ని పుట్టించడమనే ట్రెండ్ మొదలైంది.ఎప్పటి నుంచి అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇరవై దశకం నుంచి ఈ పోకడ ఎక్కువయ్యింది.

Telugu Satya, Mathuvadalara, Sathya, Satyamathu, Sri Simha, Tollywood-Movie

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం తెలుగు కమెడియన్ సత్య.( Comedian Satya ) నిన్న విడుదలైన మత్తు వదలరా 2కి( Mathu Vadalara 2 ) పాజిటివ్ టాక్ రావడంలో సత్య పోషించిన పాత్ర చాలా కీలకం.బయటికి వచ్చిన ఆడియన్స్ శ్రీసింహ( Sri Simha ) గురించి కాకుండా సత్య గురించే మాట్లాడుకుంటున్నారంటే దానికి కన్నా వేరే నిదర్శనం అక్కర్లేదని చెప్పాలి.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం పగలబడి నవ్వించేలా పేల్చిన లైనర్స్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఒకదాన్ని మించి మరొకటి ఓ రేంజ్ లో చక్కిలిగింతలు పెట్టాయి.

మత్తు వదలరా 1 లోనూ తన టాలెంట్ చూపించిన సత్యకు దర్శకుడు రితీష్ రానా ఈసారి దానికి రెట్టింపు స్కోప్ ఇచ్చాడు.

Telugu Satya, Mathuvadalara, Sathya, Satyamathu, Sri Simha, Tollywood-Movie

ఎంతలా అంటే స్క్రీన్ ని తినేస్తాడేమో అని డౌట్ వచ్చే రేంజ్ లో.అయితే నిజానికి సత్యలో ఇంత మంచి పొటెన్షియాలిటీ ఉందని గతంలో ఎన్నోసార్లు రుజువయ్యింది.హనుమాన్ లాంటి విజువల్ గ్రాండియర్ లో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తన ఉనికిని చాటుకున్నాడు.

డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ లో కాస్త ఎంటర్ టైన్ చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ వినిపించే సమాధానం సత్య.రంగబలి ఫ్లాప్ అయినా దాని గురించి ఒక నలుగురు మాట్లాడుకున్నారంటే రీజనేంటో చెప్పనక్కర్లేదు.

ఫైనల్ గా దర్శకులు గుర్తించాల్సింది ఒకటుంది.సత్య వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ఇస్తాడని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube