తెలుగు సినిమా ఇండస్ట్రీ నందమూరి ఫ్యామిలీకి చాలా సపరేట్ గుర్తింపు అయితే ఉంది.ఇక ఆయన సాధించిన సక్సెస్ ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఎందుకంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినప్పటికి ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఇక ఆయన కెరియర్ పోయింది అనుకున్న సమయంలో పటాస్,( Pataas ) బింబిసారా( Bimbisara ) లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్.
( Kalyan Ram ) ఇక మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వనప్పటికి ఆయన హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పుడు ప్రదీప్ చిలుకూరి( Pradeep Chilukuri ) దర్శకత్వంలో చేస్తున్న ఒక సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక దానికోసమే 300 మంది ఫైటర్లతో ఒక భారీ ఫైట్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగుతుందనే చెప్పాలి.
కళ్యాణ్ రామ్ మొదట్నుంచి కూడా యాక్షన్ సినిమాలకి పెద్దపీట వేస్తూ వస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా తను యాక్షన్ ఫిల్మ్ చేసి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో విజయశాంతి( Vijayashanti ) కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుంది.మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.