జానీ మాస్టర్ విషయంలో కుట్ర జరిగిందా.. ఆయనను కావాలనే కేసులో ఇరికిస్తున్నారా?

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్( Jani Master ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా( Dance Choreographer ) వ్యవహరించిన విషయం తెలిసిందే.

 Jani Master Booked In Sexual Assault Case Details, Jani Master, Sexual Assault,-TeluguStop.com

అలాగే పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు జానీ మాస్టర్.ఇటీవల తిరు సినిమాకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా కూడా జాతీయ అవార్డును( National Award ) అందుకున్న విషయం తెలిసిందే.

జ‌న‌సేన‌కు బ‌ల‌మైన స‌పోర్ట‌ర్‌.ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంత అభిమాన‌మో ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థం అవుతుంటుంది.

Telugu Janasena, Jani Master, Janimaster, Narsingi, Pawan Kalyan, Sexual Assault

జ‌న‌సేన( Janasena ) కోసం ఆయ‌న ప్ర‌చారం చేశారు.పార్టీ టికెట్ కూడా ఆశించారు, కానీ పొత్తు ధ‌ర్మం వ‌ల్ల ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు.అయినా స‌రే, నిజాయ‌తీగా పార్టీకి సేవ చేశారు.ఒక పాట జనసేన కోసం రూపొందించగా ఆ పాట బాగా క్లిక్ అయిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ ఒక రేప్ కేసులో చిక్కుకున్నారు.జానీ మాస్టర్ తనపై చాలాసార్లు హత్యాప్రయత్నానికి పాల్పడినట్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది.

ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తును ప్రారంభించారు.ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్.

ఇప్పటివరకు ఆయన పై ఎలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు.

Telugu Janasena, Jani Master, Janimaster, Narsingi, Pawan Kalyan, Sexual Assault

అలాంటిది దానిని మాస్టర్ పై ఇంత పెద్ద నింద మోపినట్లు తెలుస్తోంది.మరి ఇది నిజమా లేదంటే ఆయనను కావాలని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక జానీ మాస్టర్ మంచితనం గురించి ఆయన సన్నిహితులు మాట్లాడుతూ ఆయన చాలా మంచోడని మహిళల పట్ల కూడా గౌరవంగా మసులు కొంటారని తెలిపారు.

రాజ‌కీయంగానూ ఎద‌గాల‌నుకొంటున్న త‌రుణంలో జానీపై కావాల‌ని ఎవ‌రైనా ఇరుకున ప‌డేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా, లేదంటె నిజంగానే జానీ ఈ త‌ప్పు చేశారా? అనే విష‌యాలు నిర్ణ‌యించాల్సింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube