అద్దె కట్టడానికి డబ్బుల్లేక ఫుట్ పాత్ పై పడుకున్నా.. రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు క్రేజీ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట ఉయ్యాల జంపాల సినిమాతో( Uyyala Jampala ) తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాజ్ తరుణ్ ఈ సినిమా తర్వాత కుమారి 21ఎఫ్ అంటూ వరుసగా పలు సినిమాలలో నటించి మంచి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Raj Tarun About His Struggles Career Starting Days, Raj Tarun, Struggles, Tollyw-TeluguStop.com

కానీ ఒక సమయం దాటిన తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.ఇటీవల 50 రోజుల వ్యవధిలోనే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు విడుదల ఈ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచాయి.

Telugu Career, Raj Tarun, Rajtarun, Struggles, Tollywood-Movie

ఈ మధ్య పురుషోత్తముడు, తిరగబడర సామీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మళ్లీ అపజయాలే అందుకున్నాడు.తాజాగా అతడు ప్రధాన పాత్రలో నటించిన భలే ఉన్నాడే సినిమా రిలీజైంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ తన కెరియర్లో కెరియర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.

నన్ను ఎవరైనా గుర్తించి ఇండస్ట్రీకి పిలవాలని ఎదురు చూశాను.దాదాపు 52 షార్ట్‌ ఫిలింస్‌ ( 52 Short Films )చేశాక రామ్మోహన్‌ గారు చూసి పిలిచారు.

యాక్టింగ్‌ చేస్తావా? డైరెక్షన్‌ చేస్తావా? అని అడిగారు.నాకు డైరెక్షనే ఇష్టమని చెప్పాను.

Telugu Career, Raj Tarun, Rajtarun, Struggles, Tollywood-Movie

అలా ఆయన దగ్గర రూ.3000కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను.ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క సీన్‌ గురించి చర్చించేవాళ్లం.అప్పుడు నేను పర్వాలేదు.కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని దీర్ఘాలు తీశాను.నెల రోజులు ఓపిక పట్టాడు.

తర్వాత ఆయనకు కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్‌ ముందుకు సాగదు, వెళ్లిపో అన్నారు.ఏం చేయాలో తోచలేదు.

అయితే బీటెక్‌ మధ్యలో ఆపేసి వచ్చాను.అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక పోవడంతో ఫుట్‌ఫాత్‌ పై 11 రోజుల పాటు పడుకున్నాను.

నీళ్లు తాగి కడుపు నింపుకునే వాడిని.ఆ తర్వాత మళ్లీ రామ్మోహన్‌ గారే పిలిపించారు.

అప్పుడు నాకు 20 ఏళ్లు! ఆ వయసులో ఒక ఫైర్‌ ఉంటుంది.ఏదైనా సాధించే తిరిగి వెళ్లాలనుకున్నాను.

నా టాలెంట్‌ ను నమ్ముకున్నాను.రైటర్‌ గా ప్రమోషన్‌ ఇచ్చారు.

ఆ తర్వాత హీరోని అయ్యాను అని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube