సిద్దార్థ్ అదితీరావు హైదరీ ఈరోజు అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని నెటిజన్లను, అభిమానులను ఒకింత ఆశ్యర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి గురించి ముందే వెల్లడిస్తామని గతంలో అదితీరావు హైదరీ( Aditirao Hydari ) చెప్పినా నిశ్చితార్థం జరుపుకొన్న విధంగానే పెళ్లి కూడా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకున్నారు.
అటు సిద్దార్థ్ కు( Siddharth ) ఇటు అదితీరావు హైదరీకి ఈ పెళ్లి రెండో పెళ్లి కావడం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అదితీరావు హైదరీ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
వనపర్తి జిల్లాలో ఉన్న 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలో( Ranganatha Swamy Temple ) సిద్దార్థ్ అదితి వివాహం జరిగింది.పట్టు వస్త్రాల్లో కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అదితి సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేయడంతో పాటు “నువ్వే నా సూర్యుడు.నువ్వే నా చంద్రుడు.నువ్వే నా తారాలోకం.మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు” అని అదితి కామెంట్లు చేశారు.మహాసముద్రం మూవీ షూట్ సమయంలో సిద్దార్థ్ అదితి మధ్య ప్రేమ ఏర్పడింది.తర్వాత రోజుల్లో పెద్దలను ఒప్పించి సిద్దార్థ్ అదితి పెళ్లి( Siddharth Aditi Wedding ) చేసుకున్నారు.
ఈ జోడీ కలకాలం అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
హీరో సిద్దార్థ్ వయస్సు 45 సంవత్సరాలు కాగా అదితీరావు హైదరీ వయస్సు 37 సంవత్సరాలు కావడం గమనార్హం.వీళ్లిద్దరి మధ్య 8 సంవత్సరాల గ్యాప్ ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.సిద్దార్థ్ హీరోగా ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తుండగా ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ సక్సెస్ రేట్ తగ్గిందనే సంగతి తెలిసిందే.
అటు సిద్దార్థ్ ఇటు అదితి పారితోషికం పరిమితంగానే ఉన్నాయని తెలుస్తోంది.