అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ లారా లూమర్( Laura Loomer ) వ్యవహారం కలకలం రేపుతోంది.మాజీ ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్‌పై( Kamala Harris ) ఆమె చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
స్వయంగా రిపబ్లికన్లు కూడా లారా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమెకు అండగా నిలుస్తున్నారు.
ఆమె రిపబ్లికన్ పార్టీకి గట్టి మద్ధతుదారని చెప్పారు.
ఈ వివాదం నేపథ్యంలో భారతీయ అమెరికన్‌ను పెళ్లి చేసుకున్న రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి జేడీ వాన్స్( JD Vance ) దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.డొనాల్డ్ ట్రంప్ రన్నింగ్‌మెట్‌గా ఉన్న వాన్స్ ఆదివారం ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌కు వచ్చినప్పుడు లారా లూమర్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది.దీనిపై ఆయన స్పందిస్తూ.
కమలా హారిస్ గురించి లారా చేసిన వ్యాఖ్యల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.విధాన సమస్యలపై తాము ఫోకస్ పెడతామని వాన్స్ అన్నారు.
ఆయన తీరును బట్టి వివాదం నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.జేడీ వాన్స్ సతీమణి భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం.ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్.
( Usha Chilukuri Vance ) ఆమె తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగో ప్రాంతంలో ఉషా బాల్యం గడిచింది.
యేల్ లా స్కూల్‌లో ఉండగానే ఉషా, జేడీ వాన్స్‌ల మధ్య పరిచయం జరిగింది.ఇది ప్రేమగా మారి, 2014లో కెంటుకీలో వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో జరగడం విశేషం.వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు.
భర్తకు చేదోడు వాదోడుగా ఆయన విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు ఉషా.
ఇదిలాఉండగా.లారా లూమర్ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తారు.నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ కనుక గెలిస్తే వైట్‌హౌస్ కరివేపాకులా ఉంటుందని వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్ ప్రసంగాలు కాల్ సెంటర్ మాదిరిగా ఉంటాయని పోస్ట్ పెట్టారు.అయితే ఆమె పోస్టులను రిపబ్లిక
.