మూవీ దర్శకులు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొత్త టెక్నాలజీల గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి.ప్రేక్షకుల అభిరుచులు, టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఇలా అన్నిటిపై పూర్తి అవగాహన పెంచుకుంటేనే హిట్స్ కొట్టగలరు.
మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గ్రాఫిక్స్‌ను బాగా వాడుకోవడంలో రాజమౌళి( Rajamouli ) ముందుంటాడు.ఒకప్పుడు ఈ దర్శకుడు ఛత్రపతి, విక్రమార్కుడు, సై, సింహాద్రి వంటి యాక్షన్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు రాజమౌళి.
ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాలు తీయడం మానేశాడు.ప్రేక్షకులకు బోరు కొట్టించకూడదని ఆయన ఉద్దేశం.

గ్రాఫిక్స్ పై( Graphics ) ఆయన పూర్తిగా ఆధారపడదు.కానీ సినిమా ఎలివేట్ కావడంలో గ్రాఫిక్స్ బాగా యూజ్ చేస్తాడు.ఎమోషన్, రివెంజ్ లాంటి ఎలిమెంట్స్ కూడా తప్పకుండా ఉండేలాగా చూసుకుంటాడు.అలానే రాజమౌళి తన సినిమాలోని విజువలైజేషన్ స్టాండర్డ్స్ ఎప్పుడూ హై స్టాండర్డ్స్‌లో ఉండేలా చూసుకుంటాడు.యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి( Baahubali ) మూవీ సిరీస్, ఆర్‌ఆర్ఆర్( RRR ) సినిమాలలో గ్రాఫిక్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.ఇటీవల దేవర ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అందులో గ్రాఫిక్స్ ఎంత చెత్తగా ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఇక ఆదిపురుష్, కల్కి వంటి రీసెంట్ సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ సరిగా కుదరలేదు.

రాజమౌళి గ్రాఫిక్స్ విషయంలో ఇతర దర్శకులకంటే ముందంజలో ఉన్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలో ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు కానీ గ్రాఫిక్ డిజైనర్లతో చాలా విధాలుగా డిస్కస్ చేసి ఆ ఫీల్డ్ గురించి బాగా తెలుసుకున్నారు.తనకు కావాల్సిన ఔట్ ఫుట్ ఎలా రాబట్టాలనేది రాజమౌళికి పూర్తిస్థాయిలో అవగాహన వచ్చినట్టుంది అందుకే ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా నిజమైనవే అని మనం భావిస్తుంటాం.నిజానికి రాజమౌళి కంప్యూటర్ గ్రాఫిక్స్ పై పెద్దగా ఆధారపడడు.
దానిపై పూర్తి అవగాహన కలిగిన తర్వాతనే దాన్ని సినిమాకి ప్లస్ అయ్యేలాగా తీర్చిదిద్దగలిగే స్థాయికి వచ్చిన తర్వాతనే ఆయన వాటిపై ఎంతో కొంత ఆధారపడటం స్టార్ట్ చేశాడు.
ఓన్లీ గ్రాఫిక్ డిజైనర్ల పైనే భారం వేస్తే అవుట్ పుట్ అనేది ఆశించినట్లు రాదు.
ఆ విషయాన్ని ఇతర దర్శకులు తెలుసుకోలేకపోతున్నారు కానీ రాజమౌళి ఎప్పుడో తెలుసుకున్నాడు.సినిమా ఏ మాత్రం చెడిపోకుండా గ్రాఫిక్స్ ఎక్కువగా వాడగల దర్శకుల్లో రాజమౌళి ముందుంటాడు.
అందుకే ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.