వరద నీటిలో పెద్ద ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి.నదుల్లో నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది.
ఇక వీటికి వరద నీరు తోడైతే అందులో నుంచి వెళ్లడం కష్టమవుతుంది కానీ ఒక ఏనుగు మాత్రం భరత నీటితో పొంగిపొర్లుతున్న ఒక నదిలోకి వెళ్ళింది.ఒడిశా రాష్ట్రం( Odisha )లోని జాజ్‌పూర్ జిల్లాలో బ్రహ్మణి నది ఉంది.
ఇది ఇప్పుడు వరద నీటితో చాలా ప్రమాదకరంగా మారింది అయితే అందులో ఒక ఏనుగు భయపడకుండా దిగింది అంతేకాదు, ఆ ఏనుగు నదిలో ఈదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధెంకనల్ జిల్లా( Dhenkanal )లోని కపిలశ్ అడవి నుంచి ఆహారం కోసం ఒక ఏనుగు గుంపు జాజ్‌పూర్ జిల్లాలోని సుకింద ప్రాంతానికి వచ్చింది.అయితే, మిగతా ఏనుగులు తిరిగి వెళ్ళిపోయినప్పటికీ, ఒక ఏనుగు మాత్రం వెనక్కి వెళ్ళలేకపోయింది./br>
మొన్న ఈ ఏనుగు గోబర్‌ఘాటి అనే ప్రాంతంలో కనిపించింది.అడవుల శాఖ వాళ్ళు దాన్ని అడవికి తరిమివేయాలని చాలా ప్రయత్నించారు.కానీ ఏనుగు అక్కడే ఉండిపోయి, మంగరాజ్‌పూర్ అనే ప్రాంతంలో రాత్రి గడిపింది.
దాంతో అక్కడి ప్రజలు చాలా భయపడ్డారు.నిన్న ఉదయం ఆ ఏనుగు బ్రహ్మణి నదిని భయపడకుండా ఈదడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే, భారీ వర్షాల వల్ల నదిలో నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది.అయినా, ఆ పెద్ద జంతువు ఏమాత్రం భయపడకుండా నదిని దాటి, కపిలశ్ అడవికి చేరుకుంది.
ఏనుగు చాలా బలంగా ఉండటమే కాకుండా ధైర్యంగా కూడా ఉంది.అందుకే చాలామంది దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
బ్రహ్మణి నది( Brahmani River )ని ఏనుగు ఈదడం చూడాలని వందల మంది అక్కడ గుమిగూడారు.చాలామంది తమ ఫోన్లలో ఈ దృశ్యాన్ని రికార్డు చేసి, ఇతరులతో పంచుకున్నారు.
ఈ https://youtu.be/b3lmaMC5i3s?si=ims1lYhZEX4gzwSe లింకు మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు.