ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో భారత సంతతికి చెందిన రెస్టారెంట్ మేనేజర్‌ని హత్య చేసిన కేసులో పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి దోషిగా తేలాడు.మృతుడిని విఘ్నేష్ పట్టాభిరామన్‌గా( Vignesh Pattabhiraman ) (36) గుర్తించారు.
నిందితుడు షాజేబ్ ఖలీద్( Shahzeb Khalid ) దొంగిలించిన రేంజ్ రోవర్‌తో సైకిల్‌పై వెళ్తున్న విఘ్నేష్‌ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ఖలీద్ (25)ను అనుమానితుడి కింద అరెస్ట్ చేసి బుధవారం రీడింగ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
నిందితుడికి సాయం చేశారన్న అభియోగాలపై అదే నగరానికి చెందిన ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఆ సమయంలో కొందరు బెయిల్‌పై విడుదలయ్యారు.
రీడింగ్‌లోని భారతీయ రెస్టారెంట్ ‘వెల్’లో విఘ్నేష్ రెస్టారెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో అతను రాయల్ బెర్క్‌షైర్ హాస్పిటల్‌లో( Royal Berkshire Hospital ) చికిత్స పొందుతూ మరణించాడు.ఆయన మరణాన్ని హత్య కేసు కింద మార్చి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.28 రోజుల పాటు రీడింగ్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణ అనంతరం పట్టాభిరామన్ హత్య కేసులో ఖలీద్‌ను న్యాయమూర్తి దోషిగా తేల్చాడు.
ఈ నేరంలో ఖలీద్‌కు సహకరించిన సోయిహీమ్ హుస్సేన్( Soiheem Hussain ) (27), మయా రెయిలీ (20)లు కూడా విచారణకు హాజరయ్యారు.హుస్సేన్ దోషిగా తేలగా, రెల్లీ నిర్దోషిగా బయటికొచ్చాడు.అక్టోబర్ 10న నిందితులకు కోర్ట్ శిక్షను ఖరారు చేయనుంది.హత్య కేసు విచారణ చేపట్టిన థేమ్స్ వ్యాలీ పోలీసులు.తలకు గాయం కావడం వల్లే పట్టాభిరామన్ మరణించినట్లు పోస్ట్‌మార్టంలో తేలిందని న్యాయస్థానానికి తెలిపారు.
ఖలీద్‌ను దోషిగా గుర్తించినందుకు తాను సంతోషిస్తున్నానని సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ స్టువర్ట్ బ్రాంగ్విన్ అన్నారు.విఘ్నేష్‌కు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే దొంగిలించబడిన రేంజ్ రోవర్‌ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడని స్టువర్ట్ చెప్పారు.