అప్పుడు 6-8 ప్యాక్ బాడీ పెంచారు.. ఇప్పుడేమో బొజ్జతో షాక్ ఇస్తున్నారే..

సినిమా హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ( Six Pack Body ) కలిగి ఉండాలి అంటారు.ఈ హీరో క్వాలిటీ ఎర్న్ చేసుకోవడానికి చాలామంది నటులు జిమ్‌లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీ సాధిస్తారు.

 Tollywood Heros Who Changed Alot From Six Pack Details, Hero Nithin, Actor Sunee-TeluguStop.com

ఇలాంటి బాడీలు హీరోలకి అవసరమే అని ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది.దాన్ని తెలుగు హీరోలు కూడా ఫాలో అవుతూ సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ బాడీ పెంచడం ప్రారంభించారు.

అలా కష్టపడి పెంచిన బాడీని సినిమాల్లో చూపిస్తూ కేక పుట్టించారు.ఫిట్నెస్ గోల్స్‌ కూడా పెంచారు.

అయితే ఇలాంటి అట్రాక్టివ్ బాడీని వారు ఎంతో కాలం మైంటైన్ చేయలేకపోయారు.అప్పట్లో 8 ప్యాక్ బాడీతో సూపర్ హాట్‌గా కనిపించిన ఈ హీరోలు ఇప్పుడు బొజ్జతో, ఫ్యామిలీ ప్యాక్‌తో షాక్‌లు ఇస్తున్నారు.ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

• సునీల్

Telugu Suneel, Nithin, Sunil, Heroes, Heroes Pack, Nithin Pack, Poolarangadu, Su

మర్యాద రామన్న సినిమాలో సునీల్( Sunil ) చాలా సన్నగా కనిపించాడు.అప్పటిదాకా బొద్దుగా ఉండేవాడు.రాజమౌళి ఇతడిని బాగా సానబెట్టాడు.

హీరో క్యారెక్టర్‌కి సెట్ అయ్యేలాగా అతడి ఫిజిక్‌ను మార్చేశాడు.తర్వాత పూలరంగడు సినిమాలో( Poolarangadu ) సిక్స్ ప్యాక్ బాడీ చూపించి వావ్ అనిపించాడు.

అతను మొత్తంగా 30 కిలోల వెయిట్, 13 అంగుళాలు నడుము సైజు తగ్గాడు.ఇదే బాడీ మెయింటైన్ చేస్తూ హీరోగా పలు సినిమాల్లో నటించాడు.

మిస్టర్ పెళ్లికొడుకు సినిమాలో సునీల్ ఫిజిక్స్ చూస్తే అబ్బా ఏమున్నాడ్రా బాబు అని అనుకోకుండా ఉండలేము.

అయితే బాడీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో కష్టపడినా సరే అతనికి హిట్స్ రాలేదు.

కాలం ఏమాత్రం కలిసి రాలేదు.దాంతో చివరికి సిక్స్ ప్యాక్ బాడీ గురించి పట్టించుకోవడం మానేశాడు.

తర్వాత కొద్దిగా బరువు పెరిగాడు.విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం స్టార్ట్ చేశాడు.ఇప్పుడు అతనికి ఫ్యామిలీ ప్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు.

• హీరో నితిన్

Telugu Suneel, Nithin, Sunil, Heroes, Heroes Pack, Nithin Pack, Poolarangadu, Su

జయం, సై, దిల్, ఇష్క్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు నితిన్.( Nithin ) ఈ హీరో మొదటి నుంచీ పక్కింటి అబ్బాయి లాగానే మామూలుగా కనిపించేవాడు కానీ విక్టరీ సినిమా( Victory Movie ) కోసం అతడు 8 ప్యాక్ బాడీ పెంచేశాడు.టక్కరి, రెచ్చిపో సినిమాల్లో కూడా 8 ప్యాక్ బాడీ చూపిస్తూ మతి పోగొట్టాడు.

అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో సినిమాల్లో సక్సెస్ కావాలంటే ఓన్లీ సిక్స్ ప్యాక్ సరిపోదు అనే విషయాన్ని గ్రహించాడు.బాడీ పై దృష్టి పెట్టడం మానేసి ఓన్లీ కథలపై మాత్రమే ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు కనిపించీ, కనిపించనట్లుగా బొజ్జ మెయింటైన్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube