జమ్ము కాశ్మీర్ లో( Jammu Kashmir ) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఆసక్తికరంగా మారింది పదేళ్ల తర్వాత జమ్ము కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర అధికార పార్టీ బిజెపికి( BJP ) ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.ఇక్కడ బిజెపికి మెరుగైన ఫలితాలు వస్తాయని అంతా భావిస్తున్నా. పార్టీలో నెలకొన్న అసంతృప్తికర పరిస్థితులు పార్టీ ఓటమికి కారణం అవుతాయేమో అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.47 స్థానాల్లో బిజెపి కేవలం 19 మంది అభ్యర్థులను మాత్రమే పోటీకి దింపింది. ఇంకా 28 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించలేదు. దీంతో బీజేపీకి ఆయా నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.
ఆర్టికల్ 370( Article 370 ) రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో గతంతో పోలిస్తే ఉద్రిక్త పరిస్థితులు బాగా తగ్గాయి అని, ప్రభుత్వం పైన భారతీయులకు పైన నమ్మకం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోది,( PM Narendra Modi ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) వంటి వారు పేర్కొంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కాశ్మీర్ లో అభ్యర్థులను పోటీకి దించకపోవడం, ఆ తరువాత కేవలం 19 స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.2024 లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. జమ్మూలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది.2 లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది .ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో శాంతి నెలకొని సాధారణ జీవితం ప్రారంభమైందని బిజెపి పేర్కొంది.ప్రధాని నరేంద్ర మోది కూడా ఈ ఏడాది మార్చి లో శ్రీనగర్ లో ర్యాలీ నిర్వహించారు.కానీ ఇప్పుడు 28 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో , బిజెపికి ఇక్కడ గెలుపు పై నమ్మకం సన్నగిల్లిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధికార ప్రతినిధి ఆల్తాఫ్ ఠాకూర్( Altaf Thakur ) కూడా స్పందించారు.ఈ ఎన్నికలు మాకు పరీక్ష. ఈరోజు విజయం సాధిస్తే భవిష్యత్తులో మరింత గా అభ్యర్థులను పోటీకి దించేందుకు అవకాశం ఉంటుంది. ఎలాగైనా కాశ్మీర్ లోయలో బిజెపి గెలుస్తుంది .కనీసం ఏడు స్థానాల్లోనైనా గెలుస్తామని ఆయన ధీమాగా చెబుతున్నా.అక్కడి పరిస్థితులు మాత్రం బిజెపికి అంత అనుకూలంగా లేవట.