యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమా( Devara ) నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.ఈ సినిమా టికెట్ రేట్లు( Ticket Rates ) సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.
తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు ఏకంగా టికెట్ రేటు 413 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.ఏపీలో సైతం 350 రూపాయల వరకు పెంపు ఉండనుందని సమాచారం.

సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందే టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు రావడం దేవర టీమ్ కు శుభవార్త అనే చెప్పాలి.అయితే ఫస్ట్ డే కలెక్షన్లకు ఢోకా లేకపోయినా టాక్ బాగుంటే మాత్రమే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.దేవర సినిమా ఎంతోమంది కెరీర్లను డిసైడ్ చేసే మూవీ కాగా కథ, కథనం కొత్తగా ఉంటే మాత్రమే ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపిక విషయంలో తప్పు చేయడని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సత్తా చాటిన సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం గమనార్హం.
ఎన్టీఆర్ ఇతర భాషల్లో దేవరతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి.
దేవర హిందీ వెర్షన్ ప్రమోషన్స్ సైతం ఒకింత గ్రాండ్ గానే జరుగుతున్నాయి.
దేవర హిందీలో ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్ లలో దేవర ఒకటి కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర రిజల్ట్ ఎలా ఉండనుందో ఈ నెల 27వ తేదీన తేలిపోనుంది.