తాజాగా దుబాయ్ వేదికగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( SIIMA ) కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు దక్షిణాది భాషకు చెందిన నటీనటులు హాజరుకానున్నారు.
దాదా ఇప్పటికే మొదటి రోజు అనగా సెప్టెంబర్ 14వ తేదీ జరిగిన వేడుకకు తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలకు 2023 సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులకు అవార్డులను కూడా ప్రకటించారు.కొందరు హీరోయిన్లు రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చారు.
ఒకరిని మించి ఒకరు ట్రెండీ దుస్తులతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఇకపోతే ఈ సైమా వేడుకలలో టాలీవుడ్ నుంచి కొందరు విజేతలుగా నిలిచారు.ఇంతకీ వాళ్లు ఎవరు ఆ సినిమాలు ఏవి అన్న విషయాన్ని వస్తే.టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ నాని( Nani ) నటించిన దసరా సినిమాకు( Dasara Movie ) ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు నాని.
అలాగే ఈ సినిమాలో ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కూడా అవార్డుని అందుకుంది.అలాగే బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డుని అందుకుంది.
ఇక కన్నడ చిత్రాలకు కూడా ఈ సందర్భంగా అవార్డులు అందించారు.

అయితే ఉత్తమ చిత్రాలుగా రెండు చిత్రాలు ఎంపిక అవ్వడంతో పాటు ఉత్తమ నటీనటులుగా టాలీవుడ్ కి చెందిన కొందరు సెలబ్రిటీలు ఎంపిక అవ్వడంతో ఆయా మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది చాలా సినిమాలు విడుదల అవ్వగా అందులో బాలయ్య బాబు( Balayya Babu ) నటించిన భగవంతుడే కేసరి,,దసరా సినిమాలకు అవార్డులు దక్కడంతో హీరోల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆయా మూవీ మేకర్స్ కి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







