తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మధ్య సక్సెస్ అందుకున్నటువంటి నటుడు జేడీ చక్రవర్తి( JD Chakravarthy ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న జెడి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఇటీవల దయ( Dayaa ) అనే వెబ్ సిరీస్ ద్వారా ఈయన మరో సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చక్రవర్తి చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన ఒక రాక్షసుడనీ,దుర్మార్గుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా చిరంజీవి గురించి జెడి చక్రవర్తి మాట్లాడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.చిరంజీవి గారిని పని రాక్షసుడు అంటూ ఈయన కామెంట్లు చేశారు.
చిరంజీవి ఘరానా మొగుడు సినిమా( Gharana Mogudu Movie ) షూటింగ్ చేస్తున్న సమయంలో తన సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది అయితే అక్కడికి వెళ్లి చిరంజీవి గారిని తాను గమనిస్తూనే ఉన్నాను అందరూ కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం, లేదంటే షిఫ్ట్ మారడం జరుగుతుంది కానీ చిరంజీవి మాత్రం కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇక హీరో అంటే ఆయనకంటూ ఎన్నో సదుపాయాలు ఉంటాయి కానీ చిరంజీవి మాత్రం తన కారులో నిద్రపోతున్నారు.ఇదేంటి ఈయన ఇలా నిద్రపోతున్నారని మనసులో అనుకున్నాను.ఇదే విషయం గురించి చిరంజీవి గారితో మాట్లాడుతూ మీరు వెళ్లి రూమ్ లో పడుకోవచ్చు కదా ఇలా ఇక్కడ పడుకున్నారు ఏంటి అని అడగగా.
ఇక్కడ పడుకుంటే నన్ను ఎవరైనా నిద్ర లేపుతారు.అదే రూమ్లో పడుకుంటే ఎవరూ లేపరు తద్వారా షూటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అంటూ మాట్లాడారు.ఆ మాటలు విని నేను మనసులో ఈయన ఏంటి మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, మరి ఇంత పని రాక్షసుడా అంటూ మనసులో అనుకునే అక్కడి నుంచి వెళ్ళిపోయాను.ఆయన అలా పనిచేశారు కాబట్టే ఇప్పుడు మెగాస్టార్ అంటూ క్రేజ్ సొంతం చేసుకున్నారని చిరంజీవి గురించి చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.