సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి వారిలో శ్యామల( Shyamala ) ఒకరు.అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వైకాపా పార్టీ తరపున ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ కోసం ఈమె పడే కష్టాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) ఊహించని విధంగా ఈమెకు అధికార ప్రతినిధిగా బాధ్యతలను అప్పగించారు.ఈమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ పదవి ఇవ్వడంతో మరోసారి యాంకర్ శ్యామల రాజకీయాల పరంగా చాలా యాక్టివ్ అయ్యారు.

ఈ క్రమంలోనే శ్యామల సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu Naidu ) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు.అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ భరోసా కల్పిస్తున్నారు.ఏనాడు పిల్లికి కూడా బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారని ఈమె ఎద్దేవా చేశారు.

ఇటీవల విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు.రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా వరద బాధితుల కోసం ఇటీవల ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన, గాయపడిన వారికి కూడా సహాయం అందించారు.చంద్రబాబు నాయుడు కేవలం అధికార బలం,మీడియా బలం ఉంది కదా అని ఏది పడితే అది ఇలా ప్రచారం చేయడం సబబు కాదని చంద్రబాబుకు శ్యామల హితవు పలికారు.
ఇలా ఈమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు తీసుకోవడంతో కూటమి ప్రభుత్వంపై తనదైన స్టైల్ లోనే నిప్పులు చెరిగారు.