టాలీవుడ్ స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సూపర్ స్టార్ మహేష్ బాబుల( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ఇద్దరు హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో క్రేజ్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే.
మహేష్ బాబు తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కి అభిమానులు కాస్త ఎక్కువే ఉన్నారని చెప్పాలి.కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయపరంగా కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే వీరిద్దరిలో చాలా క్వాలిటీస్ సేమ్ గా ఉన్నాయట.ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ క్వాలిటీస్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
పవన్, మహేష్‌లో ఉన్న కామన్ క్వాలిటీస్‌ని దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) వెల్లడించడం విశేషం.ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు త్రివిక్రమ్.ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీస్( Common Qualities ) గురించి చెబుతూ, ఇద్దరిలో సింప్లిసిటీని తాను గమనించాడట.ఇద్దరూ కాంప్లికేటెడ్ పీపుల్ కాదని తెలిపారు.
బయటకు అది కనిపించదు కానీ, ఇద్దరిలోనూ కామన్ ఫీచర్ ఉందని, బహుశా ఈ ఇద్దరు తనతో కలవడానికి అదే కారణమని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అది ఈ ఇద్దరికి కూడా తెలిసి ఉండదని ఆయన అన్నారు.అలా మహేష్ ని అతడు సినిమా( Athadu Movie ) సమయంలో చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు.ఆయన వార్‌ట్రోబ్ లో రెండు ప్యాంట్లు రెండు షర్ట్ లు ఉంటాయంతే.
ఒక పెయిర్ షూ, ఒక పెయిర్ స్లిప్పర్స్ ఉంటాయి.అదే కారు, అది పెద్దదా? చిన్నదా అనేది పట్టించుకోరు.అది రిచ్ కారా? కోటి రూపాయలదా, పది లక్షలదా అనేది తెలియదు, అనవసరం కూడా.అలాగే ఉన్న ఇళ్లు పెద్దదా? చిన్నదా అనేది కూడా చూడరు.ఒక రూమ్ చాలు.అలాగే చూసుకోవడనికి సినిమాలు ఉంటే చాలు, చదువుకోవడానికి బుక్స్ ఉంటే చాలు అంతే.
ఇలా సేమ్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ లో కూడా చూశాను.ఆయనకు నాలుగు చెట్లు ఉన్నాయా? చాలు.చదువుకోవడానికి నాలుగు పుస్తకాలు ఉన్నాయా? చాలు.ఆయన అంతే రెండు ప్యాంట్లు, రెండు షర్ట్ లు.ఈ ఇద్దరు చాలా లీన్ గా బతుకుతారు.పెద్దగా అవసరాలు ఉండవు.
ఎంత ఉంటే అంతటితో అడ్జస్ట్ అయిపోతారు అని వెల్లడించారు త్రివిక్రమ్.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.