ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) తన పదవికి రాజీనామా చేస్తానని నిన్న ప్రకటన చేశారు.రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించడంతో పాటు, ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
తనను అక్రమంగా అరెస్టు చేశారని, ప్రజలు తన నిజాయితీకి సర్టిఫికెట్ ఇచ్చేంతవరకు తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది లేదని కేజ్రీవాల్ ప్రకటించారు .ఆయన ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే ఆమ్ ఆద్మీ పార్టీ , ప్రభుత్వంలో కీలక నేతగా గుర్తింపు పొందిన మంత్రి అతిషి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా అతిషి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటివారు జైలులో ఉన్నప్పుడు ఆతిషి పార్టీ లోను , ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు./br>

. ప్రతి వేదిక పైన కేజ్రీవాల్ కు, ఆమె భార్యకు అండగా నిలిచారు.అంతేకాకుండా కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన వారిలో అతిష కూడా ఒకరు.
కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనతో పాటు జైలుకు వెళ్లి వచ్చిన మనీష్ సిసోడియా పేరును సీఎం గా ప్రకటిస్తే బిజెపి ఎదురుదాడికి దిగే అవకాశం ఉంటుంది.అందుకే అతీషి పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
కేజ్రీవాల్ కూడా జైలు నుంచి వచ్చిన వెంటనే రాజీనామా చేయడం పక్క వ్యూహం ప్రకారమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అతిషీ సీఎంగా బాధ్యతలు అప్పగించడం ద్వారా బిజెపి పై మరింత ఎదురు దాడికి దిగేందుకు అవకాశం ఉంటుందని కేజ్రీవాల్ అంచనా వేస్తున్నారు.
పార్టీ సీనియర్ నాయకులు జైలులో ఉన్న సమయంలో అతిషి రాజకీయ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించడం, 2015 జూలై నుంచి ఏప్రిల్ 17 2018 వరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా( Manish Sisodia )కు ఆమె సలహాదారుగా కూడా ఉన్నారు.

2020 ఎన్నికల తరువాత పార్టీ ఆయనను గోవా యూనిట్ కు ఇన్చార్జిగా నియమించింది.ఇక అతిష నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే ఢిల్లీలో ఆమె జన్మించారు పంజాబీ రాజపుత్ కుటుంభానికి చెందినవారు.కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిషి 14 శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో అత్యధిక మంత్రిత్వ శాఖలు ఆమె నిర్వహిస్తున్నారు .







