మార్నింగ్ వాక్‌కి వెళ్లిన మలేషియన్ మహిళ.. అంతలోనే ఇంత ఘోరం..?

మలేషియా( Malaysia ) దేశం, సబా రాష్ట్రంలో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది.తంజుంగ్ అరు రిక్రియేషన్ పార్క్‌లో జాగింగ్ చేస్తున్న 30 ఏళ్ల మహిళపై ఒక గుంపు వైల్డ్ ఓటర్స్ దాడి చేశాయి.

 A Malaysian Woman Who Went For A Morning Walk.. Is It So Bad., Otter Attacks, Sa-TeluguStop.com

ఓటర్స్ అనేవి సెమీ ఆక్వాటిక్ జీవులు.ఈ నీటి జంతువులు చేపలు ఎక్కువగా తింటాయి.

చూసేందుకు ఇవి ముంగిసల వలె ఉంటాయి.ఈ దాడిలో మారియాసెల్లా హరుణ్‌( Mariasella Harun ) అనే ఆ మహిళ తీవ్రంగా గాయపడి, నిలబడలేని స్థితికి చేరుకుంది.

ఆహారం కోసం ఆమెపై దాడి చేసిన ఓటర్స్ ఆమె శరీరంలో తమ దంతాలను గట్టిగా దించాయి.చాలా రక్తం కారుతుండగా పార్కింగ్ స్థలం వైపు పరుగులు తీశాయి.

ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.వాటిలో నల్లటి చొక్కా, గులాబీ రంగు టైట్స్ ధరించింది ఆ మహిళ.ఆమెపై కర్బ్‌పై కూర్చుని ఉండగా కాళ్లపై చాలా కోతలు, తల, చేతులపై రక్తపు మరకలు ఉన్నట్లు చూడవచ్చు.సబా రాష్ట్ర వన్యప్రాణి శాఖ( Sabah ) అధికారి రోలాండ్ ఆలివర్ నియూన్ మాట్లాడుతూ, ఆ పార్కులోని చెరువులో ఆహారం ఎక్కువగా ఉండటం వల్లనే ఓటర్లు మనుషులపై దాడి చేశాయని చెప్పారు.

ప్రజలు వాటికి ఆహారం పెట్టడం వల్ల వాటి ప్రవర్తన మారిపోయిందని ఆయన అన్నారు.

దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్ళగా, వన్యప్రాణి బృందం ఓటర్లను పరిశీలించడానికి పార్కుకు చేరుకుంది.హరుణ్‌ ఆ పార్కుకి తరచుగా వెళ్తుంది.బుధవారం ఉదయం 6:10 గంటలకు ఆమె పార్కుకి వెళ్లారు.కినబాలు గోల్ఫ్ క్లబ్ దగ్గర ఉన్న కాలువ నుంచి ఏదో జీవి బయటకు దూకిందని ఆమె చెప్పారు.ఆ జీవులు చాలా ఉన్నాయి.ఆమె పరుగులు తీస్తుండగా ఆ జీవి ఆమెపై దాడి చేసింది.”దాడి జరిగినప్పుడు నేను నిలబడలేకపోయాను” అని ఆమె చెప్పారు.అధికారులు ప్రజలను కంచెల దగ్గరకు వెళ్లవద్దని, వన్యప్రాణులతో కలవకుండా ఉండాలని సూచించారు.ఓటర్స్‌ను దగ్గరగా వెళ్లి తాకవద్దని కూడా చెప్పారు.ఎందుకంటే, ఓటర్స్‌ కోపం వస్తే కొరుకుతాయని సబా రాష్ట్ర వన్యప్రాణి శాఖ అధికారి చెప్పారు.ఆ మహిళపై దాడి చేసిన ఓటర్లకు చిన్న పిల్లలు ఉన్నాయి.

ఆ మహిళ వాటి పిల్లలకు ఏదైనా హాని చేస్తుందని అనుకుని వాటికి భయం వేసింది.అందుకే ఆమెపై దాడి చేసి ఉండవచ్చు.

ఆ పార్కులో ఒక కుటుంబంగా కలిసి ఉండే ఓటర్లు ఉన్నాయి.అవి ఉదయం, సాయంత్రం చెరువులో చేపలు పట్టుకుంటాయి.

తర్వాత తమ ఇంటికి వెళ్లిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube