ఉన్నత చదువులు అభ్యసించి కెరీర్లో స్థిరపడాలని , ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో( Australia ) అడుగుపెట్టిన భారతీయ విద్యార్థుల( Indian Students ) భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.ఇటీవల ఆస్ట్రేలియన్ అధికారులు దాదాపు 150 ఘోస్ట్ కాలేజీలను మూసివేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇవి విద్యార్ధులకు సాధారణ శిక్షణ, అధ్యయనాలను అందించడం లేదని రుజువు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతో ఈ కాలేజీలలో లక్షలాది రూపాయల ఫీజు చెల్లించి అడ్మిషన్ తీసుకున్న భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు గందరగోళంలో పడింది.
వీటిలో కొన్ని కళాశాలలు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు, స్టడీ వీసా అడ్వైజర్స్ సహ యాజమాన్యంలో ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది.దశాబ్ధాలుగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అంతర్జాతీయ విద్యార్ధులకు బ్యాక్‌డోర్ ఇమ్మిగ్రేషన్, వర్క్ పర్మిట్లను అందిస్తున్నాయి.
ఘోస్ట్ కాలేజీల( Ghost Colleges ) వ్యవహారం తెరపైకి రావడంతో ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ సీరియస్ అయ్యారు.తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి, విద్యార్ధులను దోపిడీకి గురిచేసే ఎవరికీ చోటు లేదన్నారు.
మీడియాలో వస్తున్న కథనాలను బట్టి.ఆస్ట్రేలియన్ స్కిల్స్ క్వాలిటీ అథారిటీ చేత మూసివేయబడిన వృత్తి విద్యాసంస్థలపై అల్బనీస్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది.నార్త్ ఇండియా నుంచి ప్రతి ఏటా వందలాది మంది విద్యార్ధులు డమ్మీ అడ్మిషన్లు తీసుకోవడానికి, పని చేసుకోవడానికి కళాశాలలకు వస్తున్నట్లుగా గుర్తించారు.ఈ వ్యవహారంపై ఓ బాధిత విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ.
తాను రెండేళ్ల క్రితం విద్యార్ధిగా ఆస్ట్రేలియాకు వచ్చానని చెప్పారు.
తాను వారానికి ఐదు రోజులు పనిచేయడానికి, నా హాజరు, కోర్సు సంగతి చూసుకుంటుందన్న హామీతో వచ్చానని.కానీ ఇప్పుడు తాను చేరిన కాలేజీకి ప్రభుత్వం సీలు వేసిందని పేర్కొన్నాడు.మమ్మల్ని ఇక్కడికి పంపిన ఏజెంట్‌పై వీసా చీటింగ్ కేసులో( Visa Cheating Case ) అభియోగాలు మోపగా.
మార్చిలో తన కార్యకలాపాలను మూసివేసినట్లుగా ఆ విద్యార్ధి చెప్పాడు.
కాగా.2023లోనూ మోసపూరితంగా దరఖాస్తులు సమర్పించిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు సీరియస్ అయ్యాయి.దీనిలో భాగంగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్‌ను నిరాకరించిన సంగతి తెలిసిందే.