తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా తన స్టామినాను చూపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇప్పుడు కూడ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.ఇక ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Vishwambhara ) కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఒకసారి ఆయన సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా కోసం ఎంతటి ఎఫర్ట్ అయిన పెట్టడంలో చిరంజీవి ఎప్పుడు ముందు వరుస లో ఉంటాడు.

అందుకే ఆయన మెగాస్టార్ గా ఎదిగాడు అంటూ చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.మరి ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి.ఇక ఇప్పుడు రీ ఏంట్రి ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.ఖైదీ నెంబర్ 150,( Khaidi No.150 ) వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) సినిమాలను మినహ ఇస్తే ఏ సినిమాలు కూడా భారీ సక్సెస్ లను అందుకోలేకపోయాయి.కాబట్టి ఇప్పుడు విశ్వంభర సినిమా మాత్రం రీ ఎంట్రీ లో ఆయన ఘనమైన సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఒక్కసారి ఈ సినిమాతో కనక పాన్ ఇండియాలో ఆయన భారీ సక్సెస్ అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో కూడా చిరంజీవి తన సత్తాను చాటుకున్న హీరోగా నిలిచిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటికే విశ్వంభర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే చిరంజీవి కూడా ఈ సినిమా విషయంలో భారీ కసరత్తులనైతే చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.