టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా ఈనెల 27న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు.ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.

అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.తాజాగా కూడా మరో వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే.దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ( Devara Pre-Release Event ) అనుమతులు రాకపోవడం గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో( Kurnool ) అభిమానుల మధ్య భారీ ఎత్తున జరగబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తు ఉంది.దాంతో మేకర్స్ నుంచి అధికార ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎదురు చూస్తు ఉన్నారు.
కానీ ఇప్పుడు కర్నూల్ లో జరిగే అవకాశాలు కనిపించటం లేదు.అక్కడనే కాదు అసలు అవుట్ డోర్ లోనే ఈవెంట్ జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందుకు కారణం అభిమానులే అని,ఎందుకంటే ఎన్టీఆర్ కి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉందని, పైగా దేవరకి ఆ తాకిడి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.దీంతో పోలీసులు కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడి సరికొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని భావించి పరిమిత అభిమానులతో హైదరాబాద్ నోవటల్ లో చేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తోంది.అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.