మాజీ మంత్రి ,వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy _ వ్యవహారం ఆ పార్టీకి, అధినేత జగన్ కు ఎప్పటి నుంచో తలనొప్పిగానే మారింది.రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.
2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.
ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి బాలినేనిలో అసంతృప్తి మరింత గా పెరుగుతూనే వస్తోంది.ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది.
ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీ( YCP )ని వీడి మరో పార్టీలో చేరుతున్నారనే లీకుల సైతం ఇచ్చారు.ఆ లీకులు వచ్చినప్పుడల్లా వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు .జగన్ సైతం బాలినేనిని తను వద్దకు పిలిచి సర్ది చెప్పారు.
అయినా బాలినేని మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తూనే వస్తున్నారు.దీంతో జగన్ సైతం బాలినేని విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.ఈ క్రమంలోని పార్టీలో ఆయన క్రమశిక్షణగా ఉంటే సరే, లేకపోతే పార్టీని వీడి వెళ్లినా నష్టం లేదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారట.
ఇకపై ఆయనను బుజ్జగించకూడదు అనే నిర్ణయానికి జగన్ వచ్చారట. ప్రకాశం జిల్లా కు చెందిన బాలనేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి కి స్వయానా బావ. వైసీపీ ఆవిర్భావం సమయం నుంచి ఆయన జగన్( YS jagan ) వెంటే నడిచారు.వై వి సుబ్బారెడ్డి తో కూడా మంచి సంబంధాలే కొనసాగిస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి బాలినేని మధ్య తీవ్ర విభేదాలు రావడంతో , అప్పటి నుంచి రాజకీయంగా తనకు వైసిపిలో ప్రాధాన్యం తగ్గిందనే అభిప్రాయంలో బాలనేని ఉంటున్నారు.
బాలినేని వ్యవహారాన్ని గుర్తించే జగన్ వై వి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా పంపించారు.
అయినా బాలినేని లో అసంతృప్తి తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి బాలినేని పంచాయతీలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి ముఖ్యంగా ఒంగోలులో ఇళ్ల పట్టాలు అందించాలనే షరతులు పెట్టడంతో స్వయంగా జగనే వెళ్లి పట్టాలు అందించారు.అయినా ఇంకా అసంతృప్తితోనే ఉండడం, జనసేన లో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని, ఆయనకు ఇష్టమైతే పార్టీలో ఉంటారు లేదంటే వెళ్ళిపోతారనే అభిప్రాయంతో జగన్ ఉన్నారట.