టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న కొందరు నటులు విలన్స్‌గా ( Villains ) కూడా సెట్ అవుతారు.ఉదాహరణకి గోపీచంద్ ని తీసుకోవచ్చు.
ముందు ఇతను విలన్ గానే నటించి వావ్ అనిపించాడు.తర్వాత హీరోగా మారాడు.
అతను విలన్ గానే కొనసాగినట్లయితే ఇండస్ట్రీ దడదడలాడేది.ఇంకా అతని లాగానే కొందరు హీరోలు ఉన్నారు.
వీళ్లు కథానాయకుడిగా కంటే ప్రతి నాయకుడిగానే బాగా యాక్ట్ చేయగలరు.వీళ్లు గనక విలన్స్ గా సినిమాలు తీసినట్లైతే స్క్రీన్ పై మంటలు పుట్టి ఉండేవి.మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
• రవితేజ

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) ఎలాంటి క్యారెక్టర్ లోనైనా అద్భుతంగా ఒదిగిపోగలడు.మొదట్లో ఈ హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే పోషించాడు.నాగార్జున “నిన్నే పెళ్ళాడతా” సినిమాలో ఒక రౌడీ లాగా కనిపించాడు.
సింధూరం సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్ అద్భుతంగా పోషించి తన సత్తా చాటాడు.ఏ క్యారెక్టర్ లో చేసినా ఆ క్యారెక్టర్ తన కోసమే పుట్టిందా అనేలాగా ఈ నటుడు నటిస్తాడు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాకు నేల తర్వాత రవితేజ హీరోగా నటిస్తూ స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు.రవన్న తన హైపర్ యాక్టివ్ నేచర్‌కి తగినట్లు విలన్ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
రవితేజ డైలాగ్ డెలివరీ కూడా భయానకంగా ఉంటుంది.మంచి మాస్ మసాలా సినిమాలో మంచి రోల్ రవితేజకి దొరికితే అతను దున్నేస్తాడు.
• బాలకృష్ణ

బాలకృష్ణ( Balakrishna ) కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించగలడు.ఈ నందమూరి అందగాడి కోసం ఒక మంచి విలన్ రోల్ రూపొందిస్తే చాలా బాగుంటుంది.ఆయన ఫైట్లు, డైలాగు డెలివరీలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
• వరుణ్ తేజ్

గద్దల కొండ గణేష్ సినిమాలో ఓ వైలెంట్ పాత్రలో వరుణ్ తేజ్( Varun Tej ) చాలా బాగా నటించాడు.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ “వామ్మో వరుణ్ ఇంత బాగా నటిస్తాడా? టవర్ స్టార్ మామూలు నటుడు కాదు, ఇతను గ్రేటెస్ట్ ఆర్టిస్ట్” అంటూ తెగ పొగిడేశారు.వరుణ్ తేజ్ కటౌట్ కి విలన్‌గా చేస్తే వెండితెరపై మెరుపులే అని చెప్పుకోవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుణ్ తేజ్ విలన్ గా ఓ సినిమా చేస్తే అది తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతుందని చెప్పుకోవచ్చు.
• సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ తేజ్

ఈ మెగా మేనల్లుళ్లు కూడా చాలా ఫైర్ ఉంది.వీరి కళ్ళల్లో ఒక రౌద్రం కనిపిస్తుంది.వీరిద్దరూ కూడా విలన్ క్యారెక్టర్స్ లో బాగా ఒదిగిపోతారని చెప్పుకోవచ్చు.
వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వరుణ్ తేజ్ సినిమాలో విలన్ గా నటిస్తే ఆ మూవీ కచ్చితంగా 100 డేస్ ఆడుతుంది.