టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) నటించిన దేవర సినిమా( Devara Movie ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు నిర్మాత కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కూడా పాల్గొన్నారు.ఈ సినిమాని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ సైతం నిర్మాతగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నందమూరి కుటుంబ సభ్యులకు వెల్లడించారు.ఇలా కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.ఈ తరుణంలోనే యాంకర్ ఈయనని ప్రశ్నిస్తూ మీరే ఈ సినిమాలను నిర్మించి ఇందులో నటించవచ్చు కదా అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.నటన పరంగా ఎప్పుడూ కూడా దయచేసి నన్ను వారితో పోల్చదని తెలిపారు.బాలయ్య( Balayya ) బాబాయ్ ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్నారు.

ఇలా బాలయ్య బాబాయ్ ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తారని ఆయన నటించిన RRR సినిమాలు తన నటనతో కంటతడి పెట్టించారని తెలిపారు.నటన విషయంలో వారికంటూ ఓ సిగ్నేచర్ ఉందనీ తెలిపారు.
ఇక నందమూరి హీరోలలో ఎప్పుడూ కూడా పోటీ ఉండదని తెలిపారు.అయితే ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి తీసుకొని సినిమాలలో నటిస్తాము అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక బాలకృష్ణ ఇటీవల కాలంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను దూరం పెట్టినప్పటికీ వీరు మాత్రం తమ బాబాయ్ కి ఎంతో గౌరవం ఇస్తూనే మాట్లాడుతూ ఉంటారు.