ఎండ‌ల దెబ్బ‌కు మీ చేతులు న‌ల్ల‌గా మారాయా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మొన్నామ‌ధ్య వ‌ర్షాల కార‌ణంగా వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డినా.

 This Is A Remedy For Whitening Hands That Have Turned Black Due To The Sun! Whit-TeluguStop.com

మ‌ళ్లీ ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి.భానుడు భ‌గ‌భ‌గ‌మంటూ ప్ర‌జ‌ల‌పై నిప్పులు కురిపిస్తున్నాడు.

దీంతో బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నాలు జంకుతున్నారు.అయితే ఎండ‌ల్లో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ముఖాన్ని బాగానే క‌వ‌ర్ చేసుకుంటారు.

కానీ, చేతులను వ‌దిలేస్తారు.ఫ‌లితంగా ఎండ‌ల దెబ్బ‌కు చేతులు న‌ల్ల‌గా మారిపోతుంటాయి.

దాంతో ఆ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి.వారు, వీరు చెప్పిన చిట్కాల‌న్నీ ట్రై చేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మారిన చేతుల‌ను తెల్ల‌గా, అందంగా మార్చుకోవ‌చ్చు.మరి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో.

ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ పెస‌ర పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ గులాబీ రేక‌ల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్‌కోల్ పౌడ‌ర్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో వాట‌ర్ లేదా రోజ్ వాట‌ర్ ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ లూజ్ స్ట్రక్చర్ వ‌చ్చే వ‌ర‌కు క‌లుపుకోవాలి.

Telugu Tips, Black, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health Tips

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి.ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్బింగ్ చేసుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా చేతుల‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా వర‌స‌గా మూడు రోజుల పాటు చేస్తే ఎండ‌ల దెబ్బ‌కు న‌ల్ల‌బ‌డిన చేతులు తెల్ల‌గా, అందంగా మ‌రియు మృదువుగా త‌యారు అవుతాయి.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube