టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య( Naga Shaurya ) చాలామంది ఆస్పైరింగ్ హీరోలకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పవచ్చు.ఈ టాలెంటెడ్ యాక్టర్ “క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ (2011)” సినిమాతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు.
తర్వాత నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ “చందమామ కథలు (2014)”లో యాక్ట్ చేశాడు.ఇదొక అంథాలజీ ఫిలిం.
శౌర్య అదే సంవత్సరం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన “ఊహలు గుసగుసలాడే”తో( Oohalu Gusagusalade ) సినిమాలో సోలో హీరోగా యాక్ట్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ రొమాంటిక్ కామెడీ మూవీ సూపర్ హిట్ అయింది.
ఇందులో రాశి ఖన్నా బబ్లీ గర్ల్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
ఇందులోని పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి.

గోదావరి జిల్లాలో పుట్టిన శౌర్య విజయవాడలో పెరిగాడు.తర్వాత సినిమాల్లో హీరో కావాలనే ఆశతో హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు.శౌర్య తన మొదటి రోల్ పొందడానికి ముందు హైదరాబాద్‌లో సినీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడ్డాడు.
తనకొచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ చివరికి హీరోగా సక్సెస్ కాగలిగాడు.పక్కింటి కుర్రాడి లాగా చాలా అమాయకంగా శౌర్య కనిపిస్తాడు.అందుకే యూత్ అతనికి బాగా కనెక్ట్ అయ్యారు.శౌర్య 2018లో నాలుగు చిత్రాలలో కనిపించాడు.
మొదట విడుదలైన ఛలో( Chalo ) బాక్సాఫీసు వద్ద హిట్ అయింది.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.
ఈ అగ్రతారతో మాత్రమే కాదు సమంతతో కూడా అతను స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.ఓ బేబీ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

శౌర్య రాజా కొలుసు డైరెక్షన్‌లో నారీ నారీ నడుమ మురారి( Naari Naari Naduma Murari ) సినిమా చేస్తున్నాడు.మహేష్ ఎస్.కోనేరుతో కలసి “పోలీస్ వారి హెచ్చరిక”,( Police Vaari Hecharika ) SS అరుణాచలంతో కలిసి NS24 చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.తను హీరోగా నటించిన కొన్ని సినిమాలను అతను కో ప్రొడ్యూస్ కూడా చేశాడు.
అందులో ఛలో, నర్తనశాల, అశ్వథామ, కృష్ణ బృందా విహారి ఉన్నాయి.ఈ హ్యాండ్సం హీరో ఇప్పటిదాకా స్మాల్ రోల్స్, గెస్ట్ రోల్స్, హీరో క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఏకంగా 20 సినిమాల్లో నటించాడు.

ఆ 25 సినిమాల్లో 19 మంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చి వారిని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశాడు.రొమాంటిక్ కామెడీ సినిమా లక్ష్మీ సౌజన్య అనే ఒక లేడీ డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇచ్చాడు.అలా కొత్త డైరెక్టర్లకు ఫేవరెట్ హీరోగా నాగశౌర్య మారిపోయాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్న దర్శకులకు ఆయన దేవుడిలాగా మారాడు.ఈ హీరోకి కొద్దిగా ఆటిట్యూడ్ ఉంటుందని చెబుతారు.టాలెంటెడ్ డైరెక్టర్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు.