రాజన్న సిరిసిల్ల జిల్లా : కుక్కలు మనుషులనే కాదు పాడి పశువులను కూడా కరుస్తూ ప్రాణాలను తీస్తున్నాయి.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శనిగరపు లింగం రైతు కు చెందిన గౌడు బర్రె సంతకు చెందిన పశువు గత మూడు రోజుల క్రితం ఓ కుక్క కాటు వేయడంతో వరిగడ్డి తినకపోవడంతో అనుమానం వచ్చిన రైతు వెంటనే వెటర్నరీ డాక్టర్కు చూపించడంతో సంబంధిత ట్రీట్మెంట్ చేశాడు.
అయినప్పటికీ పశువు సోమవారం మృతి చెందింది.
సుమారు 35 వేలు విలువచేసే పశువు అని తనకున్న రెండు బర్లలో ఒక బర్రె మృతి చెందడంతో ఆవేదన వ్యక్తం చేశాడు.
కుక్కలు మనుషులతో పాటు పాడిపశువులను కరుస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు.సంబంధిత అధికారులు కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అదేవిధంగా పశువు ఖననం చేసేందుకు ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ సిబ్బంది ఓ ట్రాక్టర్ ను ఏర్పాటు చేసి తరలించాలని కోరారు.