జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా( Devara ) ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొంతమంది కావాలని ఈ సినిమా గురించి ట్రైలర్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు.గతంలో ఏ సినిమా ట్రైలర్ విషయంలో జరగని స్థాయిలో ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి ట్రోలింగ్ జరిగింది.
నందమూరి ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉన్నా తారక్ ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ కామెంట్ చేయలేదు అని సంగతి తెలిసిందే.దేవర విషయంలో వస్తున్న ట్రోల్స్ అభిమానులను ఎంతగానో బాధపెట్టాయి.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇతర హీరోల అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది.ప్రభాస్ మహేష్ బన్నీ అభిమానులు( Prabhas Mahesh Bunny Fans ) దేవర సినిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kalyan Fans ) సైతం దేవర సినిమా సక్సెస్ సాధించాలని అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.కొంతమంది మాత్రమే వ్యక్తిగత కారణాలతో దేవర మూవీ కంటెంట్ ను ట్రోల్ చేయడం జరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉండగా దేవర మూవీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.సాధారణ ప్రేక్షకులలో సైతం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.
ఈ కారణాల వల్లే ఒక వర్గం దేవర సినిమా విషయంలో నెగిటివ్ ప్రచారం చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా రిలీజ్ రోజున కూడా అభిమానులు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో దేవర ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.