సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు.అయినప్పటికీ తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేసే హీరోల్లో విక్రమ్( Vikram ) మొదటి స్థానం లో ఉంటాడు.
ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.ఇక ఎప్పటికే ఆయన చేసిన ‘తంగలాన్ ‘ సినిమా( ‘Thangalan’ movie ) ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయింది.

ఇక ఈ సినిమాకి భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో తన తదుపరి సినిమాల మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ మరొక ప్రయోగం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక అడవి ప్రాంతంలో నివసించే కొన్ని తెగల వాళ్లకు సంబంధించిన సినిమాలను చేసే క్రమంలో ఆయన కొన్ని స్క్రిప్ట్ లను వింటున్నట్టుగా కూడా తెలుస్తోంది.
అందులో ఒక కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆయన ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఆయన చేసే సినిమాలు ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకోవడంతో ఆయనను మించిన నటులు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును అయితే పొందాడు.

మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి తంగలాన్ తో తెలుగు, తమిళంలో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరి రాబోయే సినిమాలతో కూడా సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఇండియా లో ఎక్కువ గా ప్రయోగాలు చేసే హీరోల్లో విక్రమ్ మొదటి స్థానం లో ఉన్నాడు…
.