దేవర మూవీ ట్రైలర్( Devara Trailer ) విడుదలైన తర్వాత ఈ సినిమా కథ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.దేవర సినిమాలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను ఉపయోగించారని ట్రైలర్ ద్వారా అర్థమైంది.
దేవర ట్రైలర్ మరింత బెటర్ గా ఉంటే బాగుండేదని చాలామంది భావించారు.అయితే దేవర సినిమాలోని ఆయుధాల వెనుక అసలు కథను తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) చెప్పుకొచ్చారు.
దేవతలను పూజించని వాళ్లు సైతం ఉంటారని అలాంటి వక్తులు ఉక్కు, ఆయుధాలను మాత్రమే నమ్ముతారని తారక్ వెల్లడించారు.80 90 దశకాలలో సాగరతీరంలో ఉన్న మారుమూల గ్రామానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కిందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.ఇప్పటికీ చాలా గ్రామాలలో దేవుడి రూపాన్ని పూజించరని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించడం గమనార్హం.

ఆ గ్రామాలలో దేవుళ్లు గ్రామ దేవతల రూపంలో కొలువై ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.నార్త్ లో అయినా సౌత్ లో అయినా ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయని తారక్ పేర్కొన్నారు.వాళ్లు తమ ఆయుధాలను( Weapons ) పూజిస్తారని తారక్ వెల్లడించారు.
ఆ ఆయుధాలే వాళ్ల మనుగడను, జాతిని సూచిస్తాయని ఎన్టీఆర్ తెలిపారు.వాటిని వాళ్లు గౌరవంగా, గొప్పగా చూస్తారని తారక్ పేర్కొన్నారు.
ఆ ఆయుధాల కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారని ఎన్టీఆర్ వెల్లడించారు.

తారక్ చేసిన కామెంట్లతో దేవర ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో తెరకెక్కనుందని క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమాలో వినియోగించే ఆయుధాలకు, సినిమా కథకు సైతం సంబంధం ఉందని వెల్లడైంది.జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తారు.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.