సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ నటుడిగా తన టాలెంట్ తో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఈయన నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు.
జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించిన ఈయన దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారు రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు .అయినప్పటికీ వెనకడుగు వేయకుండా కసితో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుంటూ రాజకీయంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన ఇష్టాలు ఏంటి అయిష్టాలు ఏంటి అనే విషయాల గురించి ఎక్కడ మాట్లడరు.కానీ తన సోదరుడు నాగబాబు( Nagababu ) మాత్రం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఫుడ్ ఏది అని యాంకర్ ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెబుతూ ఆంధ్ర స్టైల్ లో పులావ్( Pulaav ) చేస్తే కనుక కళ్యాణ్ బాబు చాలా ఇష్టంగా తింటారని నాగబాబు వెల్లడించారు.
పులావ్ కనుక ఉంటే రోజు తినే దానికంటే కాస్త ఎక్కువగానే తింటారని తెలిపారు.ఇక తనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా అమ్మ చేత చేయించుకొని తింటారని నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.