సీనియర్ దివంగత నటి శ్రీదేవి ( Sridevi ) నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) .ఈమె ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం తెలుగులో కూడా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఇన్ని రోజులు బాలీవుడ్ కి పరిమితమైన జాన్వీ కపూర్ త్వరలోనే దేవర సినిమా ( Devara Movie )ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది.

ఎన్టీఆర్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు ఏమాత్రం కొదువ ఉండదు.అక్కడ నేను చాలా తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకున్నాను కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదు.

సౌత్ సినిమాలలో నటించడమే నా కోరికగా పెట్టుకున్నాను.ఆ సమయంలోనే నాకు దేవర సినిమాలో అవకాశం వచ్చింది.ఈ సినిమా ఛాన్స్ వచ్చిన సమయంలోనే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మరొక అవకాశం వచ్చింది దీంతో తాను ఏ సినిమా చేయాలని కన్ఫ్యూజన్‌లో ఉన్నా.అప్పుడు కరణ్ జోహార్( Karan Johar ) నాకు మంచి సలహా ఇచ్చాడు.
ముందైతే తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వు.ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మంచి ఆఫర్లు వచ్చేస్తాయని అన్నారు.
ఇలా ఆయన సలహా మేరకు తాను దేవర సినిమాకు కమిట్ అయ్యాను.ఆయన చెప్పిన విధంగానే దేవర సినిమా విడుదల కాకుండానే మరొక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.