నిన్ను నమ్మం బాబూ... అంటూ కొత్త నినాదం ! ఆ విధంగా ముందుకు వెళ్తారట

రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు అనేవి కామన్.ఎవరికి వారు తమ ఎత్తుగడలను వేసుకుంటూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే… ఇదంతా ఓట్లను రాబట్టుకునే ఎత్తుగడలో భాగంగానే.అయితే… ఇప్పుడు ఈ తతంగం అంతా… ఏపీలో స్టార్ట్ అయ్యింది.మరో కొద్ది నెలల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనేది తేలిపోనుండడంతో… టీడీపీ- వైసీపీ పార్టీలు ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.అందుకే ప్రచారాలు కూడా వినూత్నంగా మొదలుపెట్టారు.

 Ys Jagan About Ninnu Namam Babu Program-TeluguStop.com

తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని వైసీపీ చూస్తోంది.దీనిలో భాగంగానే కొత్తరకంగా ఎత్తుగడ వేసింది ఆ పార్టీ.

తెలుగుదేశం పార్టీ… జన్మభూమిలో అధికారకంగా… అభివృద్ధి స్టికర్ లు ఇంటింటికి అతికించాలని ప్రణాళిక తయారు చేస్తే , వైసీపీ దానికి విరుగుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు, ఇన్నాళ్లూ చేసిన అన్యాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది.ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబూ.’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ యాత్రకు సంఘీభావంగా ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకూ చేపట్టాల్సిన ముందస్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ అన్ని నియోజకవర్గాలకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించారు.


– జనవరి 2: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పత్రికా సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాల గురించి వివరించాలి.– జనవరి 3 నుంచి 7: ప్రతి నియోజకవర్గంలో రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలి.ఈ సందర్భంగా ‘నిన్ను నమ్మం బాబూ…’ అనే పెద్ద హోర్డింగ్‌ను తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.– సమన్వయకర్తలు గ్రామాల్లో పర్యటించే సమయంలో పార్టీ పంపిన స్టిక్కర్లను అతికించిన వాహనాలనే ఉపయోగించాలి.– కనీసం 500 మంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి.హాజరైన వారితో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి మద్దతుగా 9121091210 నంబరుకు మిస్డ్‌ కాల్స్‌ ఇప్పించాలి.గ్రామాల్లో సమావేశాల తర్వాత ర్యాలీలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి.– జనవరి 9న ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ, ర్యాలీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమన్వయకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి, సభను విజయవంతం చేయాలి.ఇలా అనేక రకాల కార్యక్రమాలు రూపొందించి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి టీడీపీ పరువు తీయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube