రోటీ,కపడా,మఖాన్ ఎవరినైనా కష్టపడేది ఎందుకు అని ప్రశ్నిస్తే చెప్పే మూడు ముక్కలు ఇవే.ప్రతి ఒక్కరూ కూడా కష్టపడేది ఆ రొట్టె ముక్క,బట్ట,ఇల్లు ఇవే.
వీటికోసమే కోటి విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు.ఎలాంటి వారు అయినా ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి కల కూడా.
అయితే ఇప్పుడు ఉన్న రేట్ల దృష్ట్యా ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చు తో కూడుకున్న విషయం.అయితే అలాంటి ఇల్లు కేవలం రూ.80 లకే సొంతం అవుతుంది అంటే మీరు నమ్మగలరా.నిజంగా ఇది నిజం.
అయితే ఇదే ఏపీ లోనో,లేదంటే తెలంగాణా లోనో కాదులేండీ… ఇటలీ లో.ఇటలీ లో సరికొత్త పధకాన్ని అమలులోకి తీసుకొచ్చారు.ఈ పధకం ప్రకారం అక్కడ ఇల్లు కొనాలి అంటే కేవలం ఒక్క యూరో చెల్లిస్తే చాలు.అంటే మన కరెన్సీ లో దాని రేటు అటు ఇటుగా రూ.80 అన్నమాట.ఆ దేశంలో ఉన్న సిసిలీ ద్వీపంలోని సంబూకా అనే గ్రామం ఈ ‘ఒక్క యూరోకే ఇల్లు పథకం’ ప్రకటించింది.
నగరాలకు, విదేశాలకు ఉద్యోగుల వేటలో పడి ప్రజలు వలస వెళ్లిపోతుండటంతో యూరోప్‌లోని చిన్న చిన్న ప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం సంబూకా గ్రామం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటోంది.
ఆ గ్రామంలో ఇప్పుడు సుమారు 5,800 జనాభా మాత్రమే ఉండడం తో ఆ గ్రామపాలక సంస్థ ‘ఒక్క యూరోకే ఇల్లు’ అనే పథకాన్ని ప్రారంభించింది.విదేశాలకు వలస వెళ్ళిపోయిన వారి ఇండ్లు పాతపడిపోయి.
శిథిలావస్థకు చేరుకోవడంతో.వాటిని యజమానులు దగ్గర నుంచి కొనుగోలు చేసి.
ఈ పథకం కింద అమ్మాలని నిర్ణయించారు.అయితే ప్రపంచంలో ఎక్కడివారైనా కూడా అక్కడ ఇల్లు కొనుక్కుని నివసించవచ్చట.
అయితే ఒక్క షరతు ఇంతకీ ఆ షరతు ఏంటంటే ఆ ఇల్లు కొన్నవారు మాత్రం మూడేళ్లలోగా ఆ ఇళ్లను మరమ్మతులు చేయించుకోవాలంటూ పెట్టింది.

అయితే ఆ మరమ్మత్తుల కోసం భారీ గా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఒక్క యూరో కి ఇల్లు అని చెప్పడం తో అందరూ ఆకర్షితులు అవుతూ అక్కడ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.ఇదే పధకం భారత్ లో కూడా అమలు లోకి వస్తే ఎంత బాగుంటుందో మరి.ప్రతి ఒక్కరూ కూడా ఈ పధకం లో చేరి తమ సొంతింటి కల ను నెరవేర్చుకొనే వారు.