జనం టూ జగన్ -జగన్ టూ జనం !

తానెప్పుడు ప్రజల్నిమరియు ఆ భగవంతుడ్ని మాత్రమే నమ్ముకున్నానని వారి ఆశిస్సులు తనపై ఉన్నంతవరకు తనను ఎవరు ఓడించలేరని ముఖ్యమంత్రి జగన్ తరచూ చెబుతూ ఉండే మాట.అయితే ఇప్పుడు ఆయన వ్యవహార శైలి హార్డ్ కోర్ వైసిపి కార్యకర్తలను నిరుత్సాహ పరుస్తున్నట్లుగా తెలుస్తుంది ….2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) ఈ స్థాయిలో విజయం సాధించడానికి తెలుగుదేశం ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత ఒక కారణమైతే ఆ వ్యతిరేకతను వైసీపీకి అనుకూలం గా ఓటుగా మారేలా బూత్ లేవల్లో కష్టపడిన కార్యకర్తలు మరో కారణం

 Ycp Cadre Upset With Ys Jagan Behaviour,ycp,ys Jagan,chandrababu Naidu,ycp Lead-TeluguStop.com
Telugu Ap, Chandrababu, Ycpcadre, Ycp, Ys Jagan-Telugu Political News

అయితే వైసిపి ప్రభుత్వం( YCP Government ) అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి ఏ రకమైన మేలు జరగలేదని, ఇప్పటి వరకు జగన్ కార్య కర్తల వూసు లేకుండా వాలంటీర్లు అందరిని నాయకుల ని చేస్తానని ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కూడా కార్యకర్తల అసంతృప్తి కి కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది.మరి మొదటి నుంచి పార్టీ జెండా మోసిన తమ సంగతి ఏమిటంటూ? ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు.జగన్( YS Jagan ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల రాజకీయ అవినీతి చాలా వరకు తగ్గింది.దాదాపు పథకాలన్నీ నగదు బదిలీలకి సంబంధించినవే కాబట్టి డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అవుతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల అమలులో రాజకీయ అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా పోయింది.

.అయితే కార్యకర్తల సంక్షేమం కోసం గానీ వారి అభివృద్ధి కోసం గానీ ఎటువంటి పథకాలు పార్టీ అమలు చేయకపోవడం వారి అసంతృప్తికి తీవ్ర కారణమవుతుంది.తెలుగుదేశం హయాంలో చంద్రబాబు జన్మ భూమి కమిటీ( Chandrababu JanmaBhoomi Committee )ల లాంటి వాటి ద్వారా ఆ పార్టీ కార్యకర్తలు చాలా మేరకు లాభపడ్డారు ….అటువంటి కార్యక్రమాలు ఏవీ వైసిపి ప్రభుత్వం చేపట్టలేదు .అది ఒకందుకు మంచిదే ఎందుకటే తెలుగుదేశం వోటమికి ప్రదాన కారణాలలో జన్మభూమి కమిటీల అవినీతి కూడా ఒకటి .అయినప్పటికీ మొదటి నుంచి పార్టీ జెండా మోసిన తమకు పార్టీ నుంచి వస్తున్న ప్రతిపలం ఏమిటన్న ప్రశ్న సాధారణ కార్యకర్తలు వేస్తున్నారు.ఎంత సేపు సామాన్య జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు తప్ప పార్టీ కోసంప్రాణం పెట్టిన తమలాంటి కార్యకర్తలను ఆదుకునే దిశగా జగన్ ఆలోచనలు లేవనిపార్టీ కాడర్ నిరుత్సాహానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది

Telugu Ap, Chandrababu, Ycpcadre, Ycp, Ys Jagan-Telugu Political News

ఐపాడ్ టీం ఆలోచనలను అమలుపరచడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ఇందులో కార్యకర్తల పాత్రను పూర్తిగా విస్మరించారు ఎంతసేపు జగన్ తో జనం, జనంకోసం జగనన్న లాంటి కార్యక్రమాలతోనే ముందుకు వెళ్తున్నారు.ఒకవేళ ఈ ప్రయత్నంలో విజయవంతం అయితే పరవాలేదు గాని లేక పోతే మాత్రం కార్యకర్తలను పట్టించుకోని తన స్వయంకృతాపరాధం తోనే ఆ పార్టీ ఓటమి చెందుతుందని విశ్లేషణలు వస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube