హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఎన్టీఆర్ ( NTR ) శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) తో సహా కళ్యాణ్రామ్( Kalyanram ) హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్( Ram Charan ) ఏఎన్నార్ కుటుంబం నుంచి నాగచైతన్య( Nagachaitanya ) హాజరైన ఈ కార్యక్రమానికి సొంత కుటుంబ సబ్యులైన జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్రామ్ హాజరు కాకపోవడం పై చర్చ జరుగుతుంది ….
తెలుగుదేశం పార్టీతో పాటు నందమూరి కుటుంబం మొత్తం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు తమ మధ్యన విభేదాలను కూడా పక్కన పెట్టి కలిసికట్టుగా హాజరయ్యారు అయితే చాలామంది వూహించినట్టే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.బాలకృష్ణ స్వయంగా చాలామంది హీరోలను వారి ఇంటికి వెళ్లి మరి ఆహ్వానించారనీ, జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం ఉత్సవాల కోసం ఎంపిక చేసిన కమిటీ సభ్యుల ద్వారా ఆహ్వానించారు.
ముందు నుంచి తనకు సెకండ్ గ్రేడ్ ప్రయారిటీ ఇస్తున్న నందమూరి కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తి తో ఉన్న ఎన్టీఆర్ వేరే కారణం చూపించి ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారని తెలుస్తుంది….అయితే బాలయ్యతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసే కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడానికి కారణమేమిటా అన్న చర్చ జరిగింది .అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవుతున్న కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబానికి క్రమంగా దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.తారకరత్న దశదిన కర్మల కార్యక్రమం అప్పుడు బాలయ్య వ్యవహార శైలి కూడా వీరి మధ్య దూరం పెంచిందని తెలుస్తుంది .అందుకే కుటుంబం కన్నా తమ్ముడే తనకు ముఖ్యమని ఆయన ప్రకటించినట్లుగా ఉందని తెలుస్తుంది .సినిమాల పరంగా ఎన్టీఆర్ లెగిసి ని కంటిన్యూ చేసే సమర్ధత కలిగిన నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు.తెలుగుదేశం మద్దతుదారులు లేదా కమ్మ సామాజిక వర్గ అభిమానులు తన వెంట లేకపోయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్త ఇమేజ్ను కలిగిన జూనియర్ తనకు పార్టీ అవసరం లేదని పార్టీకే తన అవసరం ఉందని నిరూపించాడు, భవిష్యత్తులో తమ అధికారానికి ఇబ్బందులు కలిగిస్తాడననే కారణంతోనే చంద్రబాబు జూనియర్ ని దూరం పెడుతుంటారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు.
ఏమైనా తను మధ్య ఉన్న విభేదాలను ఈ కార్యక్రమం వేదికగా బహిరంగపరుచుకున్నట్లుగా ఉందని తెలుస్తుంది….నందమూరి కుటుంభం తో తనకు సఖ్యత లేదని తన గైర్హాజరీ తో జూనియర్ నిరూపించుకుంటే తన మద్దతు తమ్ముడికే అని కళ్యాణ్ రామ్ తేల్చి చెప్పినట్లయ్యింది
.