పవన్ సినిమాలో మహానటి... నిజమేనా...?

దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

 Will Keerthi Suresh Play Heroine Role I N Pawan Movie-TeluguStop.com

ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ ఇప్పటికే మొదలైనప్పటికీ నటీనటుల విషయంలో మాత్రం పలు వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి హీరోయిన్ వార్త నెట్ లో బాగా హల్ చల్ చేస్తోంది.ఇందులో అజ్ఞాతవాసి చిత్రంలో  సూర్యకాంతం పాత్రలో మెప్పించినటువంటి కీర్తి సురేష్ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ చిత్రానికి “విరూపాక్ష” అనే టైటిల్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఖరారు చేసినట్లు సమాచారం.అయితే ఈ విషయాలపై చిత్ర యూనిట్ సభ్యులు గానీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Telugu Keerthi Suresh, Keerthisuresh, Pawan Kalyan-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించినటువంటి పింక్ చిత్ర రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube