తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత రేవంత్ రెడ్డి.ప్రత్యర్థి నేతలు ఒకటంటే దానికి రెండింతలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పోలిటికల్ హిట్ పెంచడం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నైజం.
అలాంటి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు కంటతడి పెట్టుకోవడం ఏంటి ? ఇప్పుడితే తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.ఇటీవల బీజేపీ నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.మునుగోడు ఎన్నికల సమయంలో కేసిఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25 .కోట్లు పుచ్చుకున్నారని హాట్ కామెంట్స్ చేసిన సంగతి విధితమే.ఈటెల చేసిన ఈ వ్యాఖ్యాలను ఖండిస్తూ అవన్నీ అబద్దపు ఆరోపణలు అని భాగ్యలక్షి ఆలయంలో ప్రమాణం కూడా చేశారు.
ఆ ఆరోపణలు నిజమని నిరూపించేకు ఈటెల కూడా అమ్మవారిపై ప్రమాణం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.ఈ సమయంలో రేవంత్ కన్నీరు పెట్టుకొని తన నిజాయితీని శంకిస్తే కాలమే సమాధానం చెబుతుందని, నిరాధార ఆరోపణలు చేస్తే ఖబడ్ఢార్ ఈటెల అంటూ రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.కేసిఆర్ తో లాలూచి తన రక్తంలోనే లేదని తుది శ్వాస వరకు కేసిఆర్( KCR ) తో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.అయితే రేవంత్ రెడ్డి పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు.
గతంలో టీడీపీలో ఉన్న టైమ్ లో ఏకంగా ఓటుకు నోటు కేసులో కూడా ఇరుకున్న సంగతి తెలిసిందే.మరి అప్పుడెప్పుడు కన్నీరు పెట్టని రేవంత్ రెడ్డి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవడమే చర్చనీయాంశంగా మారింది.
అయితే రేవంత్ కన్నీరు పెట్టుకోవడం వెనుక అసలు కారణం కాంగ్రెస్( Congress ) లో అనిశ్చితి కారణం అనేది కొందరి అభిప్రాయం.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టినది మొదలుకొని ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలుస్తూ వచ్చారు.ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఒంటరి వాడనే వాదన వినిపిస్తూనే ఉంది.పార్టీ నుంచి బయటకు వెళ్ళే ప్రతిఒక్కరు కూడా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపనాలు చేస్తూనే బయటకు వెళుతున్నారు.
ఇక పార్టీలో ఉన్నవాళ్ళు కూడా రేవంత్ రెడ్డిపై మూకుమ్మడి పోరాటం చేస్తున్నారు.దీంతో కొన్నాళ్ళ నుంచి రేవంత్ రెడ్డి దూకుడు స్వాభావం చాలావరకు తగ్గింది.ఈ నేపథ్యంలో కేసిఆర్ వద్ద రేవంత్ రెడ్డి 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడనే ఆరోపణ.సొంత పార్టీ నేతల పదే పదే ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.
అందుకే తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ అమ్మవారిపై ప్రమాణం చేశారని కొందరి వాదన.మొత్తానికి ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే.