వైసీపీ( YCP ) ఫేక్ పోస్టులను వదిలే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Achchennaidu ) అన్నారు.బీజేపీ కాళ్లపై పడటం, కాళ్లు మొక్కడం వైసీపీ సంస్కృతి అని విమర్శించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah )పిలుపు మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని తెలిపారు.ఈ క్రమంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.