తమిళ హీరో విశాల్ నటించే సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.మనోడు చేసే సినిమాలు అడపాదడపా ఇక్కడ సూపర్ హిట్లుగా నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్నాయి.
కాగా తాజాగా విశాల్ నటిస్తున్న సినిమా ‘చక్ర’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.
దర్శకుడు ఆనందన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను ఆనందన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే అభిమన్యుడు అనే సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న విశాల్ మరోసారి అలాంటి కథనంతోనే మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలను విశాల్ మనకు చూపిస్తాడని తెలుస్తోంది.
గతంలో అభిమన్యుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ గురించిన కాన్సెప్ట్‌తో మనల్ని అలరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అంటుడంతో ఈసారి ఎలాంటి కాన్పెస్ట్‌తో వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను మే 1వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో విశాల్ సరసన రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.