భారతీయులకు వాహనప్రీతి ఎక్కువ.అందులోనూ కారు అంటే ఇంకాస్త మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి.
ఓ వ్యక్తి కారు మీద ఇక్కడ తిరుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఓ బాగా సంపాదించాడు అని ఇక్కడ పరిగణిస్తారు.అందుకే సగటు సామాన్యుడు కూడా కారుని కొనాలని ఇక్కడ కలలు కంటూ ఉంటాడు.
ఇంకొంతమందికి కారు చాలా సెంటిమెంట్.అదేకాకుండా ఇక్కడ చాలామంది తమ కుటుంబంతో పాటు కలిసి లాంగ్ జర్నీ చేయాలని అనుకున్నపుడు కార్ అయితేనే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు.
అయితే దానికోసం ప్రతిసారీ క్యాబ్ బుక్ చేసుకోవడమంటే కష్టమే.అందుకే డబ్బులు కాస్త ఎక్కువైనా తమకు నచ్చిన కారు కొనుక్కొని ఎంజాయ్ చేయాలని భవిస్తూ వుంటారు.అలా కొత్త కారు కొన్న సందర్భంగా ఓ కుటుంబం మొత్తం సరదాగా డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.ఆ వీడియో అక్కడికి, ఇక్కడికి చేరి ఆఖరికి దేశ వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ అఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) కంట పడడంతో ఆయన సదరు వీడియోని షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
అవును, ఛత్తీస్‌గఢ్( Chhattisgarh )లో ఒక కుటుంబం వారు కొన్న మహీంద్రా స్కార్పియో-N ఎస్‌యూవీ డెలివరీ సందర్భంగా కుటుంబం మొత్తం కొత్త కారు ముందు డాన్సులు చేశారు.పిల్లలు, పెద్దలు అని తేడాలేకుండా అందరూ ఓ హిందీ పాటకు ఉత్సాహంగా చిందులు వేశారు.ఈ వీడియో కార్ న్యూస్ గురు అనే ట్విటర్ పేజీ ద్వారా షేర్ కాగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దానిపై స్పందిస్తూ రీట్వీట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని పేర్కొన్నారు.