ఈ మానవ జీవితంలో ఎప్పుడు ఏ క్షణాన ఎలా పోతామో తెలియదు.ఈ జీవితం శాశ్వతం కాదని తెలిసినా సరే ఎన్నో రకాల ఆంక్షలతో బతుకుతున్నాం.
ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇలాంటి అంతరాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.కుల పరమైన లేదంటే ప్రాంతీయ పరమైన లేదంటే మతపరమైన అంతరాయాలు అధికంగా ఉన్నాయి.
వీటన్నింటినీ తొలగించి మానవ సంబంధాలను మెరుగు పరిచినప్పుడే ఈ దేశం ఎంతో అందంగా ఉంటుందని ఇప్పటికే ఎందరో గొప్ప గొప్ప కవులు, నాయకులు చెప్పారు.కానీ ఎవరూ పట్టించుకోరు.
అయితే పెద్ద వారిలో కనిపించే ఈ రకమైన అంతరాయం చిన్న పిల్లల్లో మాత్రం ఉండదని మరోసారి నిరూపితమయింది.సాధారణంగానే చిన్నారులు అంటే దేవుళ్లతో సమానంగా భావిస్తుంటారు.కల్మషం లేని మనసులతో వారు చేసే పనులు అందరినీ ఆకట్టుకుంటాయి.ఇలాంటి స్వచ్చమైన మనస్సులు కలిగిన ఇద్దరు చిన్నారులకు సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
మానవుల మధ్య ఉండాల్సింది ప్రేమ, అనుబంధం కానీ అంతరాయాలు కాదని తెలియజేస్తోంది.ఈ వీడియోలో ఓ రద్దీ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ఎదురెదురుగా ఉంటారు.
ఇందులో బ్లూ టీషర్టు వేసుకున్న పిల్లాడు ఉన్నత కుటుంబానికి అంటే ధనవంతుల పిల్లాడిగా తెలుస్తోంది.ఇంకో చిన్నారి ఏమో పేద పిల్లాడిగా అర్థం అవుతోంది.కానీ తమకు అలాంటి ధనిక, పేద అంతరాయాలు లేవని ఇద్దరూ నవ్వుకుంటూ గెంతులేస్తుంటారు.ఇందులో బ్లూ టీ షర్టు పిల్లాడు తన ఎదురుగా ఉన్న చిన్నారిని చూసి ఆనందంతో గంతులేస్తాడు.
ఇంతలో రంగుల టీ షర్ట్ వేసుకున్న చిన్నోడు బ్లూ టీ షర్టు పిల్లాడిని ఆనందంగా వచ్చి కౌగిలించుకుంటాడు.ఇక ఆ పిల్లాడు కూడా ఆనందంగా హగ్ చేసుకుంటున్నట్టు ఇందులో కనిపిస్తుంది.
దీన్ని చూసిన వారంతా ఇలా అందరూ కలిసి మెలిసి ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.