తెలుగు ప్రేక్షకులకు హీరో విక్టరీ వెంకటేష్( Hero Victory Venkatesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు వెంకటేష్.
ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను( Family entertainer movies ) తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు.వెంకటేష్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే మగవారి కంటే ఎక్కువగా ఆడవారి సినిమా థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు.
అందులోనూ ముఖ్యంగా ఫ్యామిలీలో ఎక్కువగా సినిమా థియేటర్లకు వస్తూ ఉంటారు అని చెప్పవచ్చు.కానీ వెంకటేష్ ఇటీవల నటించిన వెబ్ సీరిస్ తో ఆ అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి.
రామానాయుడు( Rana Naidu Web Series ) అనే వెబ్ సిరీస్ లో నటించిన భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు వెంకటేష్. బూతులే బూతులు, వల్గారిటీ సన్నివేశాలు, సెక్స్ తప్ప ఇందులో ఏం లేదనేది మేజర్ ఆడియెన్స్ వాదన.
అయినా దీన్ని యూత్ బాగానే చూశారు.బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ కావడంతో యూత్ దీన్ని చూసింది.
కానీ మేజర్‌గా విమర్శలు ఎదుర్కొంది.
ముఖ్యంగా వెంకటేష్ ట్రోల్స్ కి గురయ్యారు.వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఇలాంటి బూతు షో చేస్తాడా? అనేది సినీ ప్రముఖులు, అభిమానులు బహిరంగంగానే విమర్శించారు.దీనిపై ఇటీవల వెంకటేష్ స్పందించి, అదొక ప్రయోగమని, కొత్త పంథాలో ప్రయత్నించామని, కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు.
అందరి అభిప్రాయాలను గౌరవించాలని, ఇప్పుడు వచ్చిన స్పందనని బట్టి మున్ముందు చేసే షోలో ఆ జాగ్రత్తలు తీసుకుంటామని, సీజన్ 2లో అది లేకుండా చూసుకుంటామని తెలిపారు వెంకీ.వెంకటేష్ ఈ బూతు ఇమేజ్ ని పోగొట్టి దాన్నుంచి బయటపడడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అందుకోసం మంచి జాతిరత్నంని పట్టారని సమాచారం.
జాతిరత్నాలు చిత్ర దర్శకుడితో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.మంచి కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలని అనుకుంటున్నారట.అనుదీప్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
రెండు మూడు ఐడియాస్ చెప్పారని, మెయిన్‌గా కథపై వర్క్ జరుగుతుందని, అన్నీ సెట్ అయితే త్వరలోనే ఒక సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి వెంకటేష్ ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాలి మరి.