వరుణ్ తేజ్ లావణ్యకు ఎంత ఖరీదైన రింగ్ తొడిగాడో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా మెగా హీరోల్లో డిఫరెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

 Varun Tej And Lavanya Tripathi To Get Engaged Details, Varun Tej, Lavanya Tripat-TeluguStop.com

కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో ఉన్న వరుణ్ తేజ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.

మెగా ఫ్యాన్స్( Mega Fans ) ఈయన పెళ్లి గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు నాగబాబు శుభవార్త చెబుతాడా అని చూస్తున్న ఫ్యాన్స్ గుడ్ న్యూస్ విన్నారు.వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ని ( Lavanya Tripathi ) లవ్ చేస్తున్నాడు అని వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా బాగా వార్తలు వస్తున్నాయి.

మరి ఎట్టకేలకు ఇదే నిజమైంది.

Telugu Fans, Nagababu, Varun Lavanya, Varun Tej, Varuntej-Movie

జూన్ 9న ఈ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.మెగా కుటుంబం, బంధువులు సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా ముగిసినట్టు తెలుస్తుంది.ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఇద్దరు కూడా మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించి ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.

Telugu Fans, Nagababu, Varun Lavanya, Varun Tej, Varuntej-Movie

ఇదంతా పక్కన పెడితే ఈ నిశ్చితార్ధంలో వరుణ్ తేజ్, లావణ్య ఒకరికి ఒకరు కాస్ట్లీ ఉంగరాలు తొడిగినట్టు తెలుస్తుంది.ఈ వేడుకలో లావణ్యకు వరుణ్ తేజ్ 25 లక్షల విలువైన రింగ్ తొడిగినట్టు సమాచారం.అలాగే లావణ్య కూడా వరుణ్ కు అంతే రేంజ్ లో నిశ్చితార్ధపు రింగ్ పెట్టినట్టు మెగా కాంపౌండ్ నుండి న్యూస్ వస్తుంది.

అలాగే ఎంగేజ్మెంట్ సందర్భంగా వరుణ్ 2 లక్షల విలువైన కుర్తా పైజామా వేసుకుంటే లావణ్య 3 లక్షల విలువైన బెనారస్ చీర కట్టుకున్నట్టు తెలుస్తుంది.అలాగే ఎంగేజ్మెంట్ సందర్భంగా భారీ పెట్టి పొత్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube