రామాయణం ప్రకారం రాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సంగతి తెలిసిందే.రావణుడు అరణ్యంలో సీతాదేవిని అపహరించిన ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తారు.
సీతారాముల వివాహం అనంతరం తన తండ్రి ఆదేశాలమేరకు అరణ్యవాసం చేపట్టిన సీతారాములు అగస్త్య మహాముని సూచన మేరకు ఈ ప్రాంతంలోనే కుటీరం ఏర్పాటు చేసుకుని నివాసముంటారు.అదే విధంగా ఈ ప్రాంతంలోనే లక్ష్మణుడు రావణాసురుడు సోదరి అయిన సూర్పనఖ చెవులు, ముక్కు కోసేస్తాడు.
అయితే ఆ మహా అరణ్యంలో ఈ ప్రదేశానికి మాత్రమే పంచవటి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం…
సీతారాములు అరణ్యంలో నివాసమున్న ఈ ప్రదేశంలో ఐదు పెద్ద వృక్షాలు ఉన్నాయి.ఈ విధంగా ఐదు వృక్షాలు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పంచవటి అని పిలుస్తారు.
ఇక్కడ ఉన్న 5 చెట్లకు నెంబర్లను కూడా వేసి ఉంటారు.ఆ 5 చెట్లు ఏమిటంటే… వట వృక్షం, బిల్వ వృక్షం, అశ్వత్థ వృక్షం, నింబ వృక్షం, ఆమ్లాక వృక్షం.
1)
వట వృక్షం
: ఈ వటవృక్షాన్ని విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు.అందుకోసమే విష్ణు భగవానుడిని వటపత్ర సాయి అని కూడా పిలుస్తారు.ఈ వటవృక్షం కింద పూజలు ప్రార్థనలు చేయడం అనాది కాలం నుంచి వస్తున్న ఒక ఆచారంగా చెబుతారు.కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీతను ఈ వృక్షం కిందే బోధించాడు.
2)
బిల్వ వృక్షం
: బిల్వ పత్రాలు ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది. బిల్వ వృక్షాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని స్వరూపము అని చెప్పవచ్చు.పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ పరమశివుడు శని ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం మారేడు వృక్షంగా మారి అజ్ఞాతంలోకి వెళ్లాడని చెబుతారు.అందుకే అప్పటి నుంచి శని ప్రభావం ఉన్నవారు ఆ పరమశివుడికి బిల్వ దళాలతో పూజించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుందని చెబుతారు.
3)
అశ్వత్థ వృక్షం
: అశ్వత్థ వృక్షాన్ని బోధివృక్షం అని కూడా పిలుస్తారు.బుద్ధుడికి జ్ఞానోదయం అయినది కూడా ఈ వృక్షం కిందే కనుక దీనిని బోధివృక్షం అని కూడా పిలుస్తారు.అంతేకాకుండా ఈ వృక్షంలో ఎంతో మంది దేవతలు కొలువై ఉంటారని అందుకే ఈ అశ్వత్థ వృక్షాన్ని స్థలవృక్ష గా భావిస్తూ పూజలు చేస్తారు.
4)
నింబ వృక్షం
: సాయిబాబా పదహారేళ్ళ వయసులో షిరిడీలో తొలిసారిగా ఈ వృక్షం కిందే వృద్ధురాలికి దర్శన భాగ్యం కల్పించారు.
5)
ఆమ్లాక వృక్షం
: నదీస్నానాలు, పూజలకు ఈ ఉసిరి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఉసిరి పై దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.ఈ ఐదు వృక్షాలను కలిపి పంచవటిలుగా పిలుస్తారు
.