మూడేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన కొడుకు ఆచూకీ సడెన్‌గా దొరికితే ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.అసలు పోయిన పిల్లలు తిరిగి ఇంటికి చేరడం అనేది దాదాపుగా జరగదు.
అలాంటిది తన కొడుకు కిడ్నాప్‌కు గురై ప్రాణాలతో ఉన్న విషయం నమ్మశక్యం కాదు ఎవరికైనా.కానీ ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు చూస్తే.కామారెడ్డి పట్టణంలోని భరత్‌నగర్ కాలనీకి చెందిన గోపి, ఉమ దంపతుల రెండో కుమారుడు గణేశ్ 2018 ఏప్రిల్ 13న ఇంటి ముందు ఆడుకుంటూ కనబడకుండా మాయం అయ్యాడు.ఆ తర్వాత కిడ్నాప్ చేసిన ఆ ముఠా ఆ బాలున్ని మరో మహిళ ద్వారా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో రూ.1.50 లక్షలకు విక్రయించారట.
ఇలా మూడు సంవత్సరాలు గడచి పోయాయి.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన వ్యక్తే బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు బ్రతికే ఉన్నాడని, అతను ఫలనా చోటులో ఉన్నాడని తెలపడంతో పట్టరాని ఆనందంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసుల సహయంతో తమ కుమారున్ని తమ వద్దకు తీసుకొచ్చుకున్నారట.నిజంగా ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం.
ఎందుకంటే మూడేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన బాలుడి సమాచారం అనూహ్యంగా లభించడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు కాబట్టి.