డైరెక్టర్ గురు పవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. ఇక ఈ సినిమాను శ్రీ రామ మూవీస్ నిర్మాణ సంస్థ పై అట్లూరి నారాయణరావు నిర్మించాడు.
ఇక ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మానుయేల్, సుమన్, మధు నందన్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటించారు.ఈ సినిమాకు గిఫ్టన్ సంగీతం అందించాడు.
సిద్ధం మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా చేశాడు.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఉదయ్ శంకర్ రాజా పాత్రలో నటించాడు.
అయితే బీకాం చదివిన రాజా జులాయిగా తిరుగుతూ ఉంటాడు.అంతేకాకుండా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటాడు.
ఇక తనకు పెళ్లి సంబంధాలు వస్తుంటాయి.అయితే అందులో శాండీ (జెన్నీఫర్) ఫోటో చూసి తొలిచూపులోనే ఆమెను ఇష్టపడతాడు.
అయితే ఓ ఇంటర్వ్యూ కోసం తన స్నేహితుడు చెర్రీ (మధు నందన్) బైకుపై వెళ్తుండగా తనకు దారి మధ్యలో శాండీ ఎదురవుతుంది.ఇక ఆరోజు ఆమె బర్త్డే కూడా ఉండటంతో తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్తూ ఉంటుంది.
అపరిచితుడు నుండి తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది.
ఈరోజు నువ్వు ఎవరితో మాట్లాడిన వాళ్ళు చనిపోతారు అని మెసేజ్ రావటంతో ఆమె దానిని ఫన్నీగా తీసుకుంటుంది.
ఆమె ఒక వ్యక్తి తో మాట్లాడగా ఆ వ్యక్తి నిజంగానే హత్య చేయబడతారు.ఇక రాజా కూడా శాండీ ని ఇష్టపడటంతో తనతో మాట్లాడుతాడు.అంతేకాకుండా ప్రేమిస్తున్నానని చెబుతాడు.ఆమె కూడా రాజాని ప్రేమించినట్లు నటిస్తుంది.కానీ ఆ తర్వాత ఆమె రాహుల్ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని.త్వరలో తాము పెళ్లి చేసుకుంటున్నామని చెబుతుంది.
దీంతో అతడు షాక్ అవుతాడు.మరి శాండీ అలా ఎందుకు చెప్పింది.
ఇంతకు శాండీకి మెసేజ్ చేసిన అపరిచితుడు ఎవరు.ఇక చివరికి ఏం జరుగుతుంది.
మధ్యలో వచ్చే ట్విస్టులు ఏంటివి అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఉదయ్ శంకర్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు.తను చేసిన రాజా పాత్రకు న్యాయం చేశాడు.అంతేకాకుండా మాస్ యాంగిల్, యాక్షన్ సన్నివేశాలలో కూడా బాగా అదరగొట్టాడు.
ఇక తొలిసారి నటనతో అద్భుతంగా కనిపించింది జెన్నీఫర్.మధు నందన్ మాత్రం తన కామెడీతో బాగా ఆకట్టుకున్నాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.సినిమా సంగీతం బాగా ఆకట్టుకుంది.మనోహర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.ఎడిటింగ్ లో కాస్త మార్పులు ఉంటే బాగుండేది.మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగానే పని చేశాయి.
విశ్లేషణ:
ఒకే రోజులో జరిగిన కథగా ఈ సినిమాను చూపించాడు డైరెక్టర్.థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరీ గా ఈ సినిమా వచ్చింది.ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ లవ్ స్టోరీగా అనిపించినా కూడా మధ్యలో వచ్చిన ట్విస్టులు మాత్రం బాగా ఆసక్తిగా ఉన్నాయి.ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది.
ప్లస్ పాయింట్స్:
సెకండాఫ్, నటీనటుల నటన, క్లైమాక్స్, సంగీతం, ట్విస్టులు, సినిమాటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ రొటీన్ గా అనిపించింది.ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.